Wednesday, September 1, 2010

ఆవులు గడ్డి తింటే మనకు మంచిది!

సాయనిక ఎరువులు, పురుగు మందులు లేకుండా పండించినవి ఆరోగ్యానికి మంచివన్నది మనకు తెలిసిందే. కూరగాయలు, పండ్ల వంటి వాటిలో ఉండే పురుగుమందుల అవశేషాలు కలిగించే దుష్పరిణామాల కారణంగా  ఎంతోమంది ఇప్పుడు వీటిని వినియోగిస్తున్నారు. అయితే ఇది కేవలం కూరగాయలు, పండ్లకే కాదు, పాలకు కూడా వర్తిస్తుంది. వివిధ పదార్థాలతో తయారుచేసిన దాణా కన్నా పచ్చగడ్డి తినే గేదెలు, ఆవుల పాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో  అసంతృప్త కొవ్వు 5 రెట్లు అధికంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఇది బరువు తగ్గటానికీ తోడ్పడుతుంది. అమెరికాలోని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌కి చెందిన హానియా కాంపోస్‌ ఇటీవల మనుషులపై చేసిన అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. పాలల్లో ఉండే సంతృప్త కొవ్వు మూలంగా తలెత్తే దుష్పరిణామాలను చాలావరకు అణచివేసి గుండె ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుందని కాంపోస్‌ అంటున్నారు. ఈ  అసంతృప్త కొవ్వు గేదె పాలలో కన్నా ఆవు పాలల్లోనే అధికంగా ఉంటుందిట. అంటే ఆవులు పచ్చగడ్డి తినటమే మన ఆరోగ్యానికి మంచిదన్నమాట.