Thursday, September 2, 2010

పీసీనే బ్యూటీ పార్లర్‌


-సాయింత్రం పార్టీకి వెళ్లాలి... ఏ డ్రస్‌ వేసుకోవాలి? కాలేజీలో ఫ్యాషన్‌ షో... ఎలా మేకప్‌ చేసుకోవాలి? ఒక్క క్లిక్‌లో ఉంది సమాధానం!
'మనిషన్నాక కాసింత కళా పోషణ ఉండాలి' అనే డైలాగు పాతదే అయినా అర్థం ఎన్ని తరాలకైనా సరిపోతుంది. పీసీనే బ్యూటీ పార్లర్‌గా మార్చేసుకుని సాఫ్ట్‌వేర్‌ల సహకారంతో 'స్త్టెలే స్త్టెలే... మాది స్త్టెలే' అని పాట పాడేస్తున్నారు. తెరపై తమకు సూటయ్యే హెయిర్‌ స్త్టెల్స్‌ని ఎంచుకుంటున్నారు. స్కిన్‌టోన్‌కు సరిపడే మేకప్‌ పద్ధతుల్ని నేర్చుకుంటున్నారు. కళ్ల కాటుక, పెదాలకు లిప్‌స్టిక్‌, మెడలో నెక్లెస్‌ ఎలా ఉంటే బాగుంటుందో ముందే తయారయ్యి చూసుకుంటున్నారు. అందుకు అవకాశం కల్పిస్తూ కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫ్యాషన్‌ టూల్స్‌ సంగతులేంటో తెలుసుకుందాం!
-అలంకరణ మీ ఇష్టం!
ఆన్‌లైన్‌ సర్వీసుల్లో మేకప్‌ సర్వీసుల్ని యాక్సెస్‌ చేయడం తెలిసిందే. సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ని సిస్టంలోకి తెచ్చుకుని మేకప్‌ పద్ధతుల్ని తెలుసుకునే వీలు కూడా ఉంది. ఇంట్లోనే బ్యూటీ పార్లర్‌ నడుపుతున్నవారికి ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు శిక్షకులుగా ఉపయోగపడతాయి. ఏయే రంగులతో మేకప్‌ చేస్తే రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. Virtual Fashion Makeup టూల్‌ అలాంటిదే. సైట్‌ నుంచి సెట్‌అప్‌ ఫైల్‌ను దిగుమతి చేసుకుని ఇన్‌స్టాల్‌ చేయగానే చక్కని యానిమేషన్‌తో సాఫ్ట్‌వేర్‌ ఓపెన్‌ అవుతుంది. హెయిర్‌ స్త్టెల్‌తో ముఖం ప్రత్యక్షమవుతుంది. పక్కనే Makeup Tools ఏర్పాటు చేశారు. Makeup Set, Mask, Facial Options, Colors విభాగాల వారీగా కనిపిస్తాయి. కళ్ల గుర్తుని ఎంచుకోగానే తెరపై ఉన్న అమ్మాయి కళ్లు మూసుకుంటుంది. దీంతో కనుబొమ్మలపై మేకప్‌ చేయవచ్చు. లిప్‌స్టిక్‌ వేసేప్పుడు కూడా పెదాలను ముందుకు కదిలిస్తూ చూపుతుంది. Tattoo ఆప్షన్‌ను ఎంచుకుని ముఖంపై టాటూ గుర్తుల్ని వేయవచ్చు. http://tinyu rl.com/virtualfashionmakeup

కొత్త కొత్తగా...
కొత్త హెయిర్‌ స్త్టెల్స్‌ని అనుకరిస్తూ మిమ్మల్ని కొత్తగా చూసుకోవాలనుకుంటున్నారా? అయితే, VHairstyle, Change My image టూల్స్‌ ఉండాల్సిందే. తక్కువ మెమరీతో చిటికెలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. వెంటనే బుల్లి విండోలో వివిధ రకాల హెయిర్‌స్త్టెల్స్‌తో ఇమేజ్‌లు ప్రత్యక్షమవుతాయి. ఎడమవైపు ఉన్న ఫొటోలో ఆయా స్త్టెల్స్‌ని అమర్చుకుని చూడొచ్చు. ఇమేజ్‌ను ప్రింట్‌ తీసుకోవచ్చు. మీ ఫొటో మీదే ప్రయోగాలు చేయాలంటే ఛేంజ్‌ మై ఇమేజ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. Loadను క్లిక్‌ చేసి ఫొటోను అప్‌లోడ్‌ చేసుకుని పక్కనే ఉన్న స్త్టెల్స్‌ని ఎంచుకోండి. Enlarge, Reduceలతో ఫొటో, జుట్టు పరిమాణాన్ని నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. Facialతో మీసాలు, గడ్డం కూడా పెట్టుకోవచ్చు. ఇక Stellureలో అయితే ప్రపంచ వ్యాప్తంగా అనుకరిస్తున్న హెయిర్‌స్త్టెల్స్‌ అందుబాటులో ఉన్నాయి. సైట్‌లోకి వెళ్లి Stellure 3d Hairstyle Studioపై క్లిక్‌ చేసి సభ్యత్వం తీసుకోండి. దీంతో Style, Favorites, Search ట్యాబ్‌లతో 200 కంటే ఎక్కువ స్త్టెల్స్‌ని చూపిస్తుంది. Style Advisor, Style Master అనే ఈ రెండూ కూడా మేకప్‌ సాఫ్ట్‌వేర్‌లే. టెంప్లెట్స్‌తో ఫొటోలను మేకప్‌ చేసుకోవచ్చు. ఇవి వాడాలంటే మైక్రోసాఫ్ట్‌ డాట్‌నెట్‌ ఫ్రేమ్‌వర్క్‌ సాఫ్ట్‌వేర్‌ ఉండాలి. http://tinyurl.com/VHairstyler, http://tinyurl.com/ changemyimage, www.stellure.com, http://tinyur l.com/styleadvisor, http://tinyur l.com/hairmaster

సిద్ధంగా సలహాలు
సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో మీ స్త్టెల్‌కి స్పందనను తెలుసుకోవాలనుకుంటే restylemeలో సభ్యులైపోండి. హోం, టాప్‌20, ఫ్రెండ్స్‌, బ్రౌజ్‌, స్త్టెల్‌ రిజల్ట్స్‌ వివరాలతో హోం పేజీ ఉంటుంది. స్నేహితుల్ని ఆహ్వానించడంతో పాటు, కమ్యూనిటీలో కనిపించే ఫొటోలను చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. టెక్ట్స్‌ మాత్రమే కాకుండా వివిధ ఓటు గుర్తులతో కూడా ప్రోత్సహించవచ్చు. ఓటింగ్‌ ద్వారా టాప్‌ 20 ఎంపిక ఉంటుంది. స్త్టెల్‌ రిజల్ట్స్‌పై క్లిక్‌ చేసి మీ స్త్టెల్స్‌కి వచ్చిన కామెంట్‌లను చూడొచ్చు. ఫ్యాషన్‌కు సంబంధించిన గేమ్స్‌ని ఆడొచ్చు. వీడియోస్‌ని ఎంచుకుని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్యాషన్‌ షోలను చూడొచ్చు. http://restyleme.com

నిపుణుడితో కాసేపు!
రకరకాల దుస్తులు, బూట్లు, ప్యాంట్లు ఏవేవి వేసుకుంటే బాగుంటుందో తెలుసుకోవాలంటే www.bestylish.org/blog సైట్‌ను చూడండి. ఈమెయిల్‌ అడ్రస్‌ ద్వారా కొన్ని స్త్టెల్‌ సీక్రెట్స్‌ని పీడీఎఫ్‌ ఫైల్‌ రూపంలో పొందొచ్చు కూడా.
.

ఫ్యాషన్‌ గుంపులు
న్‌లైన్‌లో ఫ్యాషన్‌ నెట్‌వర్క్‌లు చాలానే ఉన్నాయి. సభ్యులైతే చాలు ప్రపంచ వ్యాప్తంగా రూపుదిద్దుకుంటున్న సరికొత్త స్త్టెల్స్‌ విశేషాల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. పేరుతో ఫ్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకుని మీ ఫొటోలను అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇతరుల ఫొటోలకు కామెంట్‌లు పెట్టొచ్చు. బ్లాగులు, ఫోరంల్లో ఫ్యాషన్‌ కబుర్లు పంచుకోవచ్చు. ఆయా సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో నచ్చిన ఫ్యాషన్‌ దుస్తుల్ని గ్రూపు చేయవచ్చు. అలాంటి సోషల్‌ నెట్‌వర్క్‌లు కొన్ని.. www.fashionising.com, http://modepass.com, www.myclosetmylife. com, www.openfashion.com, www.fashion-networks.com, http://ethicalfashionforum.nin g.com,www.fashion-network.net, www.shmotter.com.

స్త్టెల్‌గా ఆడండి!
* వర్చువల్‌ ఫ్యాషన్‌ ఫ్రొఫెషనల్‌, http://download.cnet.com/virtualfashionprofessional
* www.123peppy.com/play/drake-bell-dress
* http://makeover.dressup.me/party-night-makeover.html
* www.ugoplayer.com/games/characterdressupcreater.html