Friday, September 3, 2010

స్వదేశీ పరిజ్ఞానంతో చైనా సూపర్‌కంప్యూటర్‌

సెకనుకు వెయ్యి ట్రిలియన్ల లెక్కలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న  సూపర్‌ కంప్యూటర్ ను చైనా రూపొందించింది. చైనాలోని రక్షణ సాంకేతిక పరిజ్ఞానం జాతీయ విశ్వవిద్యాలయం ఈ కంప్యూటర్‌ను గత ఏడాది రూపొందించింది. 
స్వదేశీ పరిజ్ఞానంతో చైనా రూపొందించిన ఈ  సూపర్‌ కంప్యూటర్‌ 'తియాన్‌హి-1' కు  సెకనుకు వెయ్యి ట్రిలియన్ల (ట్రిలియన్‌ అంటే లక్షకోట్లు) లెక్కలు నిర్వహించగలదు. మరో మాటలో చెప్పాలంటే.. 130 కోట్ల మంది వరుసగా 88 ఏళ్లపాటు చేసే పనిని ఈ కంప్యూటర్‌ ఒక్క సెకనులో పూర్తి చేస్తుంది. అత్యాధునిక సీపీయూ చిప్‌లను కలిగి ఉండటం ద్వారా తియాన్‌హి-1కి ఈ సామర్థ్యం సమకూరింది.  యానిమేషన్‌, జీవవైద్యపరిశోధన, రోదసి ప్రయోగాలకు అవసరమైన పరికరాల తయారీ, వనరుల గుర్తింపు, వాతావరణ అధ్యయనం, ఆర్థిక కార్యకలాపాలు, కొత్త పదార్థాల తయారీ వంటి పనుల్లో తియాన్‌హి-1ని ఉపయోగించాలని చైనా భావిస్తోంది.