Friday, September 3, 2010

గిన్నిస్‌ రికార్డుకెక్కిన ప్రవాసాంధ్రుడు

'మా తుఝే సలాం' పాటను 265 భాషలలో పాడి మానా ప్రగడ సాయి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది మే 16న శాన్‌హూసేన్‌లోని మేఫేయిర్‌ కమ్యూనిటీ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆస్కార్‌ విజేత రహమాన్‌ స్వరపరచిన 'మా తుఝే సలాం' పాటను 265 భాషలో పాడి రికార్డు సృష్టించాడు. దీనితో గిన్నిస్‌ నిర్వాహకులు ఆయన పేరుని రికార్డుల్లోకి ఎక్కించారు. గిన్నిస్‌ నిర్వాహకులు ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు అఫ్తాబ్‌ శివదాసాని చేతుల మీదుగా అందుకున్నాడు. మాన ప్రగడ నరసింహ మూర్తి కుమారుడు సాయి.