skip to main |
skip to sidebar
సెల్ టవర్లతో పక్షులకు ముప్పు
10:10 AM
Vikasa Dhatri
కిచ.. కిచల సందడితో మన ఇళ్ళ ముందు గింజలను తింటూ మనకు ఆహ్లాదాన్ని పంచేవి పిచ్చుకలు. మరి ఆ పిచ్చుకలను చూసి ఎన్ని రోజులైంది? అవి కనుమరుగై ఎన్నో ఏళ్లైంది కదా. మానవ జీవితాలతో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఆ చిన్ని పిట్టలు ఉన్నట్టుండి ఎందుకు కనుమరుగయ్యాయి? సెల్ ఫోన్ టవర్ల విద్యుదయస్కాంత తరంగాలే వాటిని నిర్ధాక్షిణ్యంగా చిదిమేశాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మొబైల్ ఫోన్ టవర్ల మూలంగా పక్షులకు ఏర్పడుతున్న ముప్పు తీవ్రతపై అధ్యయనం చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ముంబైకి చెందిన నాచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ అసద్ రహ్మాని ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు.