skip to main |
skip to sidebar
ప్రధాన సమాచార కమిషనర్‌గా ఏఎన్ తివారీ
9:56 PM
Vikasa Dhatri
ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా ఉన్న అనుగ్రహ నారాయణ్ తివారీ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. 1969 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి గతంలో సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో పనిచేశారు. ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్‌గా ఉన్న వజహత్ హబీబుల్లా ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ చేశారు. పార్టీల ఆదాయపు పన్ను రిటర్నులను ప్రజలు పరిశీలించవచ్చన్నది సమాచార కమిషనర్‌గా తివారీ తీసుకొన్న కీలక నిర్ణయాల్లో ఒకటి. 1945 డిసెంబరు 19న ఒరిస్సాలో జన్మించిన తివారీ నల్గొండజిల్లా భువనగిరి సబ్‌కలెక్టరుగా పనిచేశారు. తర్వాత గుంటూరులో వాణిజ్య పన్నుల విభాగం ఉప కమిషనర్‌గా, కడప, వరంగల్ జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్‌గా వ్యవహరించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా, గవర్నర్ కార్యదర్శిగా, ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేశారు. 2005 డిసెంబరు 25న ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ చెందారు. అదే తేదీ నుంచి ఆయన కేంద్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఆయన గురించిన మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.