బ్రౌజర్‌లో గూగుల్ సెర్చ్ తెలిసిందే! పీసీలో కూడా గూగుల్ సెర్చ్ చేయవచ్చని తెలుసా? అదే Google Desktop. దీన్ని ఇన్‌స్టాల్ చేసి తెరపై వచ్చిన గుర్తుని రన్ చేయగానే డెస్క్‌టాప్‌కు కుడివైపు గూగుల్ సెర్చ్‌బాక్స్‌తో పాటు కొన్ని అదనపు సర్వీసులు కనిపిస్తాయి. దీంతో డెస్క్‌టాప్‌పై ఉన్న డేటాని సులభంగా వెతకడం మాత్రమే కాకుండా గూగుల్ అందిస్తున్న అదనపు సౌకర్యాల్ని కూడా తెరపైనే పొందొచ్చు. ఇవీ ప్రయోజనాలు
డెస్క్‌టాప్‌పై ఉన్న word.doc ఫైల్‌ను ఓపెన్ చేయాలంటే సెర్చ్‌బాక్స్‌లో word టైప్ చేయగానే సెర్చ్ ఫలితాల్లో ఫైల్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇలా తెరపై ఉన్న అన్ని ఫైల్స్, అప్లికేషన్స్‌ని వెతికి ఓపెన్ చేయవచ్చు. గూగుల్ డెస్క్‌టాప్‌తో పాటు గడియారం, వాతావరణ వివరాలు, వార్తల్లోని ముఖ్యాంశాలు కనిపిస్తాయి. ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యి ఫొటోలను డెస్క్‌టాప్‌పైనే స్త్లెడ్‌షో రూపంలో పొందొచ్చు. అలాగే, సిస్టంలోని ఫొటోలను మై పిక్చర్స్‌లోకి కాపీ చేసి స్త్లెడ్‌షో చూడొచ్చు. ప్లస్‌మార్క్‌పై క్లిక్ చేసి మరిన్ని అదనపు సర్వీసుల్ని గూగుల్ డెస్క్‌టాప్‌కి అనుసంధానం చేయవచ్చు. ఆర్కుట్‌లో స్నేహితుల పుట్టిన రోజుల్ని గుర్తుచేసే Orkut Birthday gadget నిక్షిప్తం చేసుకోవచ్చు. మీరు వాడుతున్న జీమెయిల్ ఇన్‌బాక్స్ స్టేటస్‌ని చెప్పే Email, బ్రౌజింగ్‌లో కనిపించిన ముఖ్యమైన సమాచారాన్ని భద్రం చేసుకోవడానికి Scratch Pad, స్టాక్ మార్కెట్ వివరాల కోసం Stocks, మీ సిస్టం సామర్థ్యాన్ని చూపే System Monitor, క్యాలెండర్, వీడియో గేమ్స్... లాంటి మరిన్ని అప్లికేషన్స్‌ని గూగుల్ డెస్క్‌టాప్‌లో పొందొచ్చు. సైడ్‌బార్ అక్కర్లేదనుకుంటే సిస్టం ట్రేలో కనిపించే గుర్తుపై రైట్‌క్లిక్ చేసి Exitని ఎంచుకోండి. www.filehippo.com/download_google_desktop/