లండన్: రోజూ ఒకట్రెండు కప్పులకు మించకుండా కాఫీ తాగుతున్నారా? అయితే దీర్ఘాయుష్షు సొంతం చేసుకున్నట్టే. ఎందుకంటే రోజూ మోతాదుకు మించకుండా కాఫీ తాగితే రక్తనాళాలు సాగే గుణం మెరుగుపడుతుందని, ఇది గుండె జబ్బుల బారి నుంచి కాపాడుతుందని ఎథెన్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో దీర్ఘాయుష్షు చేకూరుతుందని వివరిస్తున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న 485 మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. గ్రీసుకు చెందిన ఇకారియా ద్వీప వాసుల్లో 65 నుంచి 100 ఏళ్ల వయసు వారిని ఇందుకు ఎంచుకున్నారు. ఇక్కడ నివసించే వారిలో మూడొంతుల మంది 90 ఏళ్లకు మించినవారే. అందుకే ఈ ద్వీపాన్ని 'దీర్ఘాయుష్షు నేల' అని పిలుస్తారు. కాఫీ తాగితే రక్తపోటు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నప్పటికీ.. కాఫీ తాగటమనేది గ్రీకు సంస్కృతిలో ఎప్పట్నుంచో వేళ్లూనుకుపోయిందని, అందుకే పరిశోధనకు ఇక్కడి ద్వీపాన్ని ఎంచుకున్నామని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ క్రిస్టియానా ఖ్రీసోహూయు అన్నారు. రోజుకి మోతాదు మించకుండా ఒకట్రెండు కప్పుల కాఫీ తాగుతున్న 56 శాతం మందిలో రక్తనాళాల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటున్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. వీరి రక్తనాళాలు యువకుల్లో మాదిరిగానే పనిచేస్తున్నాయని తెలిపారు.
Thursday, September 2, 2010
కాఫీతో దీర్ఘాయుష్షు!
12:55 AM
Vikasa Dhatri