Friday, September 3, 2010

విశ్వం దేవుడి సృష్టి కాదు


విశ్వాన్ని దేవుడు సృష్టించలేదని, భౌతిక శాస్త్ర సూత్రాల ఫలితంగానే మహా విస్ఫోటనం (బిగ్‌ బ్యాంగ్‌) సంభవించిందని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ 'ద గ్రాండ్‌ డిజైన్‌' అనే తన కొత్త పుస్తకంలో పేర్కొన్నారు. 'ద గ్రాండ్‌ డిజైన్‌'  పుస్తకం విడుదలకు సిద్ధంగా ఉంది.  అమెరికాకు చెందిన భౌతికశాస్త్రవేత్త లియోనార్డ్‌ మ్లోడినౌతో కలిసి ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. విశ్వానికి సృష్టికర్త ఉన్నాడనే నమ్మకాన్ని కొత్త విజ్ఞాన సూత్రాలు పనికిరానిదిగా తేల్చాయని తన కొత్త పుస్తకంలో పేర్కొన్నారు. ''భూమ్యాకర్షణ సూత్రం ప్రకారం ఏమీలేని స్థితి నుంచి విశ్వం స్వయంగా తనకు తానుగా సృష్టించుకుంటుంది. అందువల్లే విశ్వం, మానవుల ఉనికి ఇంకా కొనసాగుతోంది'' అని హాకింగ్‌ అభిప్రాయపడ్డారు. సూర్యుడిచుట్టూ కాకుండా మరో నక్షత్రంచుట్టూ ఒక గ్రహం తిరుగుతున్నట్టు 1992లో బయటపడిందని.. ఇది అస్తవ్యస్త స్థితి నుంచి విశ్వం పుట్టుకురాలేదని, దేవుడు సృష్టించాడనే న్యూటన్‌ అభిప్రాయం నిజం కాదని తెలుసుకోవటానికి తోడ్పడిందని వివరించారు.