skip to main |
skip to sidebar
ఐదులక్షల కోట్ల వరకూ 'పై' లెక్కింపు
11:25 PM
Vikasa Dhatri
గణితశాస్త్రంలో వృత్తం చుట్టుకొలత, వ్యాసం నిష్పత్తినే 'పై' అంటారు. దీనిని 22/7గా పేర్కొంటారు. 'పై'ని ఎంత భాగించినా శేషం వస్తూనే ఉంటుందని మనకు తెలుసు. జపాన్‌కు చెందిన ఒక ఇంజినీర్ సొంతంగా రూపొందించిన కంప్యూటర్‌ను ఉపయోగించి 'పై' విలువను ఐదులక్షల కోట్ల (ఐదు ట్రిలియన్లు) వరకూ లెక్కించారు. ఒక ఫ్రెంచి ఇంజినీర్ గత ఏడాది నమోదు చేసిన రికార్డును (2.7 ట్రిలియన్లు) బద్దలు కొట్టారు. ఒక ఆహార ఉత్పత్తుల సంస్థలో ఇంజినీర్‌గా పని చేస్తున్న షిగెరు కొండొ 'పై' విలువను వీలైనన్ని ఎక్కువ స్థానాల వరకూ లెక్కించటానికి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం 32 టెరాబైట్ల హార్డ్‌డ్రైవ్‌తో సొంతంగా కంప్యూటర్‌ను తయారుచేశారు. అనంతరం 5ట్రిలియన్ల స్థానాలవరకూ పై విలువను లెక్కించారు.