skip to main |
skip to sidebar
ఇక ఆన్‌లైన్‌లోనే ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు!
5:59 AM
Vikasa Dhatri
దాదాపు శతాబ్దం క్రితం నుంచి ముద్రితమవుతున్న ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే లభ్యం కానున్నాయా? మారుతున్న పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆన్‌లైన్ వెర్షన్‌కు గిరాకీ విపరీతంగా పెరగడం వల్ల పుస్తక రూపంలో ఉన్న నిఘంటువులకు ఆదరణ తగ్గిందని ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ తెలిపింది. తాజా ఎడిషన్‌కు సవరణలు చేసి, మళ్లీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి మరికొన్నేళ్లు పడుతుందని, అప్పటికి పుస్తక రూపంలో ఉన్న నిఘంటువులకు ఆదరణ ఉండడం ప్రశ్నార్థకమేనని ప్రచురణకర్తలు భావిస్తున్నారు. ప్రచురణ సమయంలో గిరాకీ ఉంటేనే పుస్తక రూపంలో నిఘంటువును తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిగెల్ పోర్ట్‌వుడ్ తెలిపారు. ''ఆక్స్‌ఫర్డ్ ఆన్‌లైన్ డిక్షనరీని ప్రతినెలా 20 లక్షల మంది వినియోగదారులు సందర్శిస్తున్నారు. ప్రింట్ రూపంలో ఉన్న నిఘంటువుకు మార్కెట్ తగ్గిపోతోంది.''అని నిగెల్ పోర్ట్‌వుడ్ పేర్కొన్నారు.