Friday, September 3, 2010

పండ్లతో క్యాన్సర్‌ దూరం

పండ్లు, కూరగాయల్లో ఎన్నో రకాల జీవక్రియాశీల సమ్మేళనాలు ఉంటాయని, వీటిని నిర్ణీత మోతాదుల్లోనే కాదు వివిధ రకాలకు చెందినవి తీసుకోవటమూ ముఖ్యమేనని నెదర్లాండ్స్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌హెల్త్‌ పరిశోధకులు వెల్లడించారు. ప్రతి రోజూ పండ్లను తినటం వలన ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచి జరుగుతుందని వారు అంటున్నారు.
పొగ తాగేవారు వివిధ రకాల పండ్లు, కూరగాయలు తింటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని వారు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే పొగ తాగటం మానెయ్యటమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గమని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌హెల్త్‌ పరిశోధకులు సూచిస్తున్నారు.