భావ వ్యక్తీకరణకు సంక్షిప్త సందేశానికి (ఎస్సెమ్మెస్) మించిన సాధనం లేదని భావిస్తున్న రోజులు ఇవి. ఎస్ ఎం ఎస్ ల సంఖ్య రోజు రోజుకు చాంతాడులా పెరిగిపోతోంది. ఇపుడు ప్రతి సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు ఇతరులకు చేరుతున్నాయని ఐక్య రాజ్య సమితి (ఐరాస) దూర ప్రసార సంస్థ వెల్లడించింది. మూడేళ్లలో ఇది మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2007లో 1.8 ట్రిలియన్ సంక్షిప్త సందేశాలు నమోదయ్యాయి. అది 2010 వచ్చేసరికి 6.1 ట్రిలియన్ దాటింది. వీటి కోసం ప్రజలు సెకనుకు రూ.6.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 2009 లెక్కల ప్రకారం సంక్షిప్త సందేశాలతో కాలం గడిపేవారిలో ఫిలిప్పీన్స్, అమెరికన్లు ముందున్నారు.
Monday, December 20, 2010
సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు
భావ వ్యక్తీకరణకు సంక్షిప్త సందేశానికి (ఎస్సెమ్మెస్) మించిన సాధనం లేదని భావిస్తున్న రోజులు ఇవి. ఎస్ ఎం ఎస్ ల సంఖ్య రోజు రోజుకు చాంతాడులా పెరిగిపోతోంది. ఇపుడు ప్రతి సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు ఇతరులకు చేరుతున్నాయని ఐక్య రాజ్య సమితి (ఐరాస) దూర ప్రసార సంస్థ వెల్లడించింది. మూడేళ్లలో ఇది మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2007లో 1.8 ట్రిలియన్ సంక్షిప్త సందేశాలు నమోదయ్యాయి. అది 2010 వచ్చేసరికి 6.1 ట్రిలియన్ దాటింది. వీటి కోసం ప్రజలు సెకనుకు రూ.6.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 2009 లెక్కల ప్రకారం సంక్షిప్త సందేశాలతో కాలం గడిపేవారిలో ఫిలిప్పీన్స్, అమెరికన్లు ముందున్నారు.
రోజూ బాదం.. దరిచేరదు జ్వరం
Thursday, December 9, 2010
'డిస్కవరి' యాత్రలో ఎలుకలు
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యోమనౌక డిస్కవరీ అంతరిక్షంలోకి చివరిసారిగా పయనమైనప్పుడు 16 ఎలుకలు ప్రయాణమయ్యాయి. అంతరిక్ష యాత్రల వల్ల వ్యోమగాముల రోగనిరోధకశక్తి తాత్కాలికంగా క్షీణించడానికి కారణాలను వెతికి పట్టుకునే ప్రయోగంలో భాగంగా వీటిని రోదసిలోకి పంపుతున్నారు. అంతరిక్ష యాత్రల కారణంగా వ్యోమగాముల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి. వైరస్, బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ల బారిన పడడాన్ని నాసా 25 ఏళ్ల నుంచి గమనిస్తోంది. తాజా ప్రయోగాన్ని టెక్సాస్ విశ్వవిద్యాలయంతో పాటు నాసాకు చెందిన ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్నాయి.
Saturday, November 27, 2010
ఒక్కరి నుంచి 2 టన్నుల కార్బన్‌డైఆక్సైడ్
తీసుకునే ఆహారం కారణంగా మనిషి ఏటా రెండు టన్నుల బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌డై ఆక్సైడ్)ను విడుదల చేస్తాడని ఒక అధ్యయనంలో తేలింది. ''మనిషి తీసుకునే ఆహారం నుంచి ఏటా రెండు టన్నుల చొప్పున కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. మనిషి నుంచి విడుదలయ్యే వాయువుల్లో దీనిది 20 శాతంగా ఉంటుంది'' అని ప్రధాన పరిశోధకుడు ఇవాన్ మౌజ్ తెలిపారు. స్పెయిన్‌కు చెందిన ఆల్మెర్ వర్శిటీ చేసిన పరిశోధనా ఫలితాలను 'జీవన చక్రం - అంచనాలు' అన్న అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది.
చందమామపై జలచక్రం
Friday, November 19, 2010
కొత్త జాతుల మలేరియా దోమలు
ఆఫ్రికాకు చెందిన భయంకరమైన రెండు జాతుల మలేరియా దోమలు జన్యుపరంగా తేడాలున్న రెండు కొత్త జాతులుగా రూపాంతరం చెందుతున్నట్లు లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. మలేరియాతో జరిపే పోరుపై ఈ ఆవిష్కరణ ప్రభావం చూపనుంది. ఆఫ్రికాలో మలేరియా వ్యాప్తికి కారణమైన అనోఫెలెస్ గాంబియా అనే దోమలపై లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ దోమలకు చెందిన రెండు జాతులు వాటి జన్యుపరిణామ క్రమంలో వేగంగా విడిపోతున్నట్లు కనుగొన్నారు. దీంతో ఎప్పటికప్పుడు వ్యాధి నివారణకు కొత్త ఔషధాలను కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ''దోమల్లో అత్యంత వేగంగా కొత్త జాతులు పుట్టుకొస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది. ఓ జాతి నివారణ పద్ధతి మరో జాతి దోమలపై సమర్థంగా పనిచేయడం లేదు'' అని పరిశోధన బృందం సభ్యుడు మారియా లానిక్‌జాక్ తెలిపారు.
చర్మకణాల నుంచి రక్తం తయారీ
రక్తమార్పిడి తప్పనిసరైన లుకేమియా తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన మూలకణ, క్యాన్సర్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త మిక్‌భాటియా సారథ్యం లో ఈ విజయం సాధించారు. ఈ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తే శస్త్రచికిత్సలు, ఇతరత్రా రక్తమార్పిడి అవసరమైన సందర్భాల్లో ఎవరి రక్తాన్ని వారే ఉపయోగించుకుని స్వస్థత పొందవచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ విధానంలో సేకరించిన మానవ చర్మకణాలను నేరుగా రక్తంగా రూపాంతరం చెందిస్తారు. ఇది మూలకణాల ద్వారా రక్తం తయారీ ప్రక్రియ కంటే సులువైన విధానమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, కేవలం యౌవన ప్రాయంలో ఉన్న వ్యక్తులనుంచి సేకరించే చర్మకణాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.
Friday, November 5, 2010
డ్రైవర్ అక్కర్లేని కారు
తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
* 1 తంగేడు పూచినట్లు
* 2 తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం
* 3 తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా
* 4 తోచీ తోయనమ్మ తోటికోడలు పుట్టింటికి వెళ్ళినట్టు
* 5 తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు
* 6 తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలము రమ్మంటే వచ్చునా
* 7 తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ
* 8 తగిలిన కాలే తగులుతుంది
* 9 తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య ఇచ్చిన మనుముకూ
* 10 తడక లేని ఇంట్లో కుక్క దూరినట్లు
* 11 తడిగుడ్డలతో గొంతులు తెగకోస్తాడు
* 12 తడిశిగాని గుడిశె కట్టడు, తాకిగానీ మొగ్గడు
* 13 తడిశిన కుక్కి బిగిశినట్టు
* 14 తడిశి ముప్పందుం మోశినట్టు
* 15 తణుకుకు పోయి మాచవరం వెళ్ళినట్లు
* 16 తద్దినము కొని తెచ్చుకొన్నట్టు
* 17 తనకంపు తనకింపు, పరులకంపు తనకు వొకిలింపు
* 18 తన కలిమి ఇంద్రబోగము, తనలేమి లోకదారిద్ర్యము
* 19 తన కాళ్లకు బంధాలు తానే తెచ్చుకొన్నట్టు
* 20 తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును
* 21 తనకు కానిది గూడులంజ
* 22 తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట
* 23 తడి గుడ్డతో గొంతులు కొయ్యడం
* 24 తండ్రికి తిండి లేక తవుడు తింటుంటే కొడుకొచ్చి కోవాబిళ్ళ కావాలన్నాడట
* 25 తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
* 26 తనది కాకపోతే కాశీదాకా దేకమన్నాడట
* 27 తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా
* 28 తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే
* 29 తల లేదు కానీ చేతులున్నాయి... కాళ్లు లేవు కానీ కాయం ఉంది?
* 30 తల ప్రాణం తోకకి వచ్చినట్లు
* 31 తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
* 32 తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది
* 33 తవుడు తింటూ వయ్యారమా?
* 34 తాగిన మందు ఉంచుకొన్నదాని పొందు ఎలాంటి పనైనా చేయిస్తుంది
* 35 తాను వలచినది రంభ, తాను మునిగింది గంగ
* 36 తా(ను) పట్టిన కుందేటికి మూడే కాళ్లు
* 37 తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడట
* 38 తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
* 39 తాజెడ్డ కోతి వనమెల్లా చెరిచింది
* 40 తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు
* 41 తాడిచెట్టెందుకెక్కావంటే, దూడ గడ్డికోసమన్నాడంట
* 42 తాడిచెట్టు కింద మజ్జిగ తాగినా కల్లు అంటారు
* 43 తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడుంటాడు
* 44 తాతకు దగ్గులు నేర్పినట్టు
* 45 తాదూర సందు లేదు, మెడకో డోలు
* 46 తానా అంటే తందానా అన్నట్లు
* 47 తామరాకు మీద నీటిబొట్టులా
* 48 తాను దూర సందు లేదు తలకో కిరీటమట
* 49 తిని కూర్ఛుంటే కొండలైనా కరుగుతాయి
* 50 తింటే గారెలే తినాలి,వింటే భారతమే వినాలి
* 51 తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు
* 52 తిండికి ముందు,తగాదాకు వెనుక ఉండాలి
* 53 తిక్కల వాళ్లు తిరుణాళ్లకెళ్తే ఎక్కనూ దిగనూ సరిపోయిందట
* 54 తిట్టను పోరా గాడిదా అన్నట్టు
* 55 తిట్టే నోరు, తిరిగే కాలు , చేసే చెయ్యి ఊరకుండవు
* 56 తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట
* 57 తినగ తినగ వేము తియ్యగనుండు
* 58 తినబోతూ రుచులు అడిగినట్లు
* 59 తిన్నింటి వాసాలు లెక్కేయటం
* 60 తిమింగలాలకు ఏ చేప అయితే ఏమిటి?
* 61 తీగ లాగితే డొంకంతా కదిలినట్లు
* 62 తుంటి మీద కొడితే పళ్ళు రాలాయి
* 63 తూట్లు పూడ్చి... తూములు తెరిచినట్లు...
* 64 తెలిసే వరకూ బ్రహ్మవిద్య తెలిశాక కూసువిద్య
* 65 తేలు కుట్టిన దొంగలా
జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగు
కొత్త గ్రహవ్యవస్థను గుర్తించిన కెప్లర్
కెప్లర్ టెలిస్కోప్ సుదూరాన ఉన్న ఒక గ్రహవ్యవస్థను నాసా శాస్త్రవేత్తలకు పరిచయం చేసింది. రోదసిలో భూమివంటి గ్రహాలేమైనా ఉన్నాయా అన్న దానిపై కెప్లర్ టెలిస్కోప్ అన్వేషణ జరుపుతుంది. సూర్యునిలాగే ఉన్న ఒక నక్షత్రం చుట్టూ శని గ్రహం పరిమాణంలో ఉన్న రెండు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని పరిశోధనలో తెలిసింది. భూమి సైజుకు కొద్దిగా పెద్దగా ఉన్న మరొక గ్రహం కూడా నక్షత్రానికి కొంత సమీపంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అది గ్రహమా కాదా అన్న విషయాన్ని నిర్థారించవల్సి ఉంది. అది గ్రహమే అయితే దానిపై జీవం ఉనికి ఉండే అవకాశాలు లేకపోలేదన్నారు. నాసా గత ఏడాది అంతరిక్షంలోకి ప్రయోగించిన కెప్లర్ టెలిస్కోపు ప్రత్యేకంగా భూమి వంటి గ్రహాలనే గుర్తిస్తుంది. నక్షత్రానికి మరీ దగ్గరగా, మరీ దూరంగా ఉండకుండా మధ్యస్థంగా ఉండే భూమివంటి గ్రహాల్లోనే జీవం ఉనికిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తరహా గ్రహాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.
Thursday, November 4, 2010
చంద్రుడిపైకి రోబో
రోదసిలో వాతావరణ మార్పులు
Monday, November 1, 2010
ప్రయోగశాలలో మానవ కాలేయం
కీలక ప్రోటీను
Saturday, October 30, 2010
కాలానికి వందనం
సమయపాలన
రచన: మాచర్ల రాధాకృష్ణమూర్తి
పేజీలు: 189; వెల: రూ.100/-
ప్రతులకు: ఎం.ఆర్.కె.మూర్తి
హారిక పబ్లికేషన్స్, ప్రకాష్‌నగర్
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
డెంగీకి దోమకాటు!
ఏడిస్ ఈజిప్టీపై పోరుకు జన్యుమార్పిడి కీటకం
Friday, October 29, 2010
జ్ఞానపదం
Thursday, October 28, 2010
సంక్షేమంలో భారత్‌కు 88వ స్థానం
సహ చట్టానికి సొంత చిహ్నం, వెబ్‌సైట్
అంగారకునిపై శాశ్వత నివాసం
వ్యోమగాములు అక్కడే స్థిరపడతారు
భారీ నిధులతో నాసా కసరత్తు
నీరు ఉండటం వల్లే..: సౌరకుటుంబంలోని గ్రహాల్లో అంగారకునిపైనే నీరు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అక్కడ మనిషి స్థిరపడటానికి ఇది అనుకూల అంశం. అయితే, ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఆక్సిజన్ లేని వాతావరణం వంటివి మాత్రం ప్రతికూల అంశాలు. వీటిని అధిగమించాల్సి ఉంటుంది. సింథటిక్ బయాలజీ, మనిషి జన్యుక్రమంలో మార్పులు తీసుకురావటం వంటి ఆధునిక టెక్నాలజీల సాయంతో ఇటువంటి సమస్యలను పరిష్కరించవచ్చని వార్డెన్ పేర్కొన్నారు. వ్యోమగాములు మొదట అంగారకుని ఉపగ్రహాలపై స్థిరపడి.. అక్కడి నుంచి అంగారకుని వివరాలు తెలుసుకోవటానికి విస్తృతమైన పరిశోధనలు జరపాల్సి ఉంటుందన్నారు. 2030 నాటికి మనిషి అంగారకుని చందమామలపైకి వెళ్లటం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
Wednesday, October 27, 2010
బాలకార్మికుల గణనపై 'సుప్రీం' అసంతృప్తి
Tuesday, October 26, 2010
పిండి కొద్దీ రొట్టె
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
* 1 పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
* 2 పగటి ముచ్చట పని చేటు
* 3 పండిత పుత్ర పరమ శుంఠ
* 4 పండితపుత్రుడు... కానీ పండితుడే...
* 5 పందికేంతెలుసు పన్నీరు వాసన
* 6 పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
* 7 పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
* 8 పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
* 9 పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
* 10 పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
* 11 పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
* 12 పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది
* 13 పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
* 14 పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
* 15 పావలా కోడికి ముప్పావలా దిష్టి
* 16 పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
* 17 పాపమని పాత చీర ఇస్తే ఇంటి వెనక్కు వెళ్ళి మూరేసుకుందట
* 18 పాలు, నీళ్ళలా కలిసిపోయారు
* 19 పిండి కొద్దీ రొట్టె
* 20 పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
* 21 పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
* 22 పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
* 23 పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
* 24 పిచ్చోడి చేతిలో రాయి
* 25 పిచ్చోడికి పింగే లోకం
* 26 పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
* 27 పిల్లికి బిచ్చం పెట్టనివాడు
* 28 పుండుకు పుల్ల మొగుడు
* 29 పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
* 30 పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
* 31 పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
* 32 పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
* 33 పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
* 34 పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
* 35 పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
* 36 పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
* 37 పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
* 38 పెరుగుట విరుగుట కొరకే
* 39 పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్ళినట్టు
* 40 పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
* 41 పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
* 42 పైన పటారం, లోన లొటారం
* 43 పొట్టోడికి పుట్టెడు బుద్దులు
* 44 పొమ్మనలేక పొగపెట్టినట్లు
* 45 పొయ్యి దగ్గర పోలీసు
* 46 పొరుగింటి పుల్లకూర రుచి
* 47 పెళ్ళీకి పందిరి వెయ్యమంటే చావుకి పాడి కట్టినట్టు
Sunday, October 24, 2010
శబ్ద కాలుష్యానికి అడ్డుకట్ట
వచ్చే దీపావళి నాటికి ప్రత్యేక వ్యవస్థ
ఇద్దరు సూర్యుల గ్రహం
భూమికి 49 కాంతి సంవత్సరాల దూరంలో దర్శనం
కనుగొన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు
పాఠ్య ప్రణాళికలో సమాచార, విద్యా హక్కు చట్టాలు
పసుపుతో కేన్సర్‌కు చికిత్స
Tuesday, October 19, 2010
సున్నిత పర్యావరణ ప్రాంతంగా దండి
వాతావరణ మార్పు వల్ల భారత్‌కే అధిక ముప్పు
Thursday, October 14, 2010
ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
* 1 ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు
* 2 ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు
* 3 ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు
* 4 ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము
* 5 ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం
* 6 ఏడ్చే దానికి మొగుడొస్తే నాకూ వస్తాడన్నట్టు
* 7 ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు
* 8 ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు
* 9 ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే
* 10 ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య
* 11 ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు
* 12 ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు
* 13 ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
* 14 ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు
* 15 ఏమండీ కరణం గారూ పాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట
* 16 ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది,అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి పడుంది
* 17 ఏరు ఏడామడలుండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట
* 18 ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
Sunday, October 10, 2010
చిన్నపాటి దెబ్బలే పిల్లలకు పెద్ద పాఠాలు
చిన్నపాటి దెబ్బలే పిల్లలకు పెద్ద పాఠాలు
లండన్,అక్టోబర్ 10: మీ పిల్లలు మోకాలి చిప్ప లు పగులగొట్టుకునో లేదా మోచేతులకు దెబ్బలు తగిలించుకునో వస్తే వాళ్లనేమీ అనకండి. ఎందుకంటే వా రి జీవితంలో 'నేర్చుకోవ డం' అనే ప్రక్రియలో అలా దెబ్బలు తగిలించుకోవడం కూ డా ఒక భాగమట. పిల్లలు చిన్న చిన్న రిస్కులు తీసుకుంటేనే మంచిదని 'హెల్త్ అండ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్లే ఇంగ్లం డ్' నివేదిక చెబుతోంది. పైగా ఆట స్థలాల్లో వారికి మోకాళ్లకు, మోచేతులకు దెబ్బలు తగిలేలా కొన్ని ఏర్పాట్లు ఉండాలని కూడా సెలవిస్తోంది.
ఉదాహరణకు ఎగుడు దిగుడు నే లపై పిల్లలు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలట. వారికి అన్నీ స్పూన్‌తో అందించి నిర్వీర్యులను చేయకుండా వారంతట వారు కొన్ని పనులు చేయడాన్ని ప్రోత్సహించాలని నిపుణుల అభిప్రాయం. ఆట స్థలాల్లో చిన్నపాటి రిస్కులు తీసుకునే అ వకాశం లేకుంటే.. బాలబాలికలు నిజజీవితంలో రిస్కులు తీసుకుని ప్రమాదంలో పడతారని వా రు హెచ్చరిస్తున్నారు.
సముద్రగర్భంలో భారత్ ఆర్‌వోవీ
సముద్రగర్భంలో భారత్ ఆర్‌వోవీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: మనుషుల అవసరం లేకుండానే సముద్రగర్భంలో ప్రయాణించే జలాంతర్గాములను మన దేశమూ రూపొందించి చూపింది. ఈ జలాంతార్గాములను రిమోట్‌లీ ఆపరబుల్ వెహికిల్(ఆర్‌వోవీ) అని పిలుస్తున్నారు. సముద్ర ఉపరితలంపై ఒక నౌక నుంచి వీటిని నియంత్రిస్తారు. వీటిని ఇప్పటి వరకూ అమెరికా, ఫ్రాన్స్, జపాన్, రష్యా, చైనా మాత్రమే రూపొందించాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరక్టర్ ఆత్మానంద్ చెప్పారు.
రష్యాకు చెందిన ఎక్స్‌పెరిమెంటల్ డిజైన్ బ్యూరో ఆఫ్ ఓషనాలజికల్ ఇంజనీరింగ్‌తో కలిసి ఎన్ఐవోటీ ఈ జలాంతర్గాములను రూపొందించిందని ఆయన తెలిపారు. సముద్రంలో 6000 మీటర్ల లోతున పరిశోధించే సామర్థ్యాన్ని భారత్ సంతరించుకోవడంతో, ఐక్యరాజ్య సమితి కేటాయించిన ప్రదేశంలో పాలీ మెటాలిక్ నాడ్యూల్స్‌లనే ఖనిజాలను వెతకడానికి మన దేశం ఉపక్రమించింది. అంతే కాక సముద్ర గర్భంలో ఆర్‌వోవీలు నిర్వహించే పరిశోధనల వలన అక్కడి భూమి, సాంద్రత, కరిగి ఉన్న ప్రాణవాయువు తదితర వివరాలు తెలుస్తాయి. త్వరలోనే కృష్ణా-గోదావరి బేసిన్‌లోనూ భారత్ తయారీ ఆర్‌వోవీ సర్వే నిర్వహిస్తుంది.
ప్రభుత్వ విభాగాల్లో అవినీతి
ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరుగుతోంది
సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి పెరిగిపోతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది. ''దేశంలో అవినీతిపై నియంత్రణ లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా ఆదాయపు పన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్ విభాగాల్లో అవినీతి విపరీతంగా ఉంది. డబ్బులివ్వకుంటే ఏ పనీ కాదు'' అని జస్టిస్ మార్కండేయ కట్జు, జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం తాజాగా వ్యాఖ్యానించింది. ఒక కేసులో ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్ మోహన్‌లాల్ శర్మను పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ వేసిన అప్పీలును అనుమతిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ పీపీ మల్హోత్రా వాదనలు వినిపిస్తూ- ఓ పన్నుచెల్లింపుదారు నుంచి ఇన్‌స్పెక్టర్ రూ.10 వేలు లంచం తీసుకొన్నట్లు దిగువ కోర్టు నిర్ధరించిందని, హైకోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించిందని ఆక్షేపించారు. ఆయనకు దిగువ కోర్టు ఏడాది కారాగార శిక్ష విధించింది. చట్టబద్ధం చేయొచ్చుగా: అదనపు సొలిసిటర్ జనరల్ వాదన అనంతరం ధర్మాసనం స్పందిస్తూ- ''ప్రభుత్వం అవినీతిని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు? అలా చేస్తే ఒక్కో పనికి ఒక మొత్తాన్ని నిర్ణయించవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏదైనా పనిచేసిపెట్టాలంటే రూ.2,500 అడగొచ్చు. ఈ విధానంతో ప్రతీ వ్యక్తి తానెంత లంచం ఇవ్వాలో ముందే తెలుసుకోవచ్చు. ప్రభుత్వ అధికారులకూ బేరమాడాల్సిన అవసరం ఉండదు. అయినా, పాపం అధికారులనూ తప్పుబట్టలేం.. ద్రవ్యోల్బణం పెరుగుతోంది కదా''అని వ్యాఖ్యానించింది. కోర్టులో విచారణకు హాజరైన ఇన్‌స్పెక్టర్- తనపై సీబీఐ అభియోగాలను తోసిపుచ్చారు. తాను అవినీతికి పాల్పడలేదని, తనకేమీ తెలియదని, ఈ కేసులో ఇరికించారని చెప్పారు. ఆయన వాదనతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు. అవినీతి ముఖ్యంగా ఆదాయపుపన్ను, అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను విభాగాల్లో తీవ్రస్థాయిలో ఉందని పునరుద్ఘాటించింది.
క్షీణిస్తున్న పరాగ సంపర్కం
భారత్‌లో కూర'గాయాల'కు కారణమిదే కలకత్తా వర్సిటీ పరిశోధనలో వెల్లడి
'దండన లేని బోధన'
'భయంతో బుద్ధి రాదు - బెత్తం చదువు చెప్పదు' అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌ను ప్రొఫెసర్ శాంతా సిన్హా ఆవిష్కరించారు. పిల్లలు, పెద్దలు సమానమేనని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను ప్రేమించటంతో పాటు వారిని గౌరవించటం కూడా మనం నేర్చుకోవాలని ఆమె అన్నారు. పిల్లలను కొట్టే హక్కు పెద్దలకు లేదని ఆమె చెప్పారు. కార్పొరల్ పనిష్‌మెంట్‌ను విద్యా హక్కు చట్టం నిషేధించిందని ఆమె చెప్పారు.
1990 ప్రాంతాల్లో మానవ హక్కుల చట్టం వచ్చింది. అప్పటి నుంచే మహిళల హక్కులు, బాలల హక్కులు, దళితుల హక్కుల గురించి అందరూ మాట్లాడటం పెరిగింది. ఈ చట్టాలతో సమస్యలు తగ్గుతాయనుకొన్నాను. కానీ చట్టాలు వచ్చినప్పటి నుంచే సమస్యలు మరింతగా పెరిగాయి. ఇందుకు కారణం ఏమిటనేది మనమంతా ఆలోచించాలి.
మాణిక్య వర ప్రసాద్, విద్యా శాఖ మంత్రి
కొట్టక పోతే పిల్లలకు చదువు రాదని తల్లిదండ్రులు కూడ భావిస్తున్నారు. దండిస్తే పిల్లల మేధస్సు పెరగదు. దండనతో విద్యార్థులలో హింసా ప్రవృత్తి పెరుగుతుంది.
ప్రొఫెసర్ హర గోపాల్, జనరల్ సెక్రటరీ, సేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ
క్రమ శిక్షణ, శిక్షల మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి.
బాల సుబ్రహ్మణ్యం, డైరెక్టర్, విద్యా శాఖ
లెర్నింగ్ డిజెబిలిటీ ఉన్న పిల్లలకు విద్య నేర్పే ఉపాధ్యాయులు మనకు లేరు. అలాగే పుట్టుకతోనే బహు ముఖ ప్రజ్ఞను కలిగి ఉన్న పిల్లలకు చదువు చెప్పగలిగే ఉపాధ్యాయులూ మనకు లేరు. ఈ రెండు రకాల పిల్లలను హాండిల్ చేయగలగటాన్ని ఉపాధ్యాయులు నేర్చుకోవాలి. విద్యార్థులందరికీ ఒకేలా మూస పద్థతిలో బోధించే విధానాన్నే మనం అనుసరిస్తున్నాం.ఇప్పటి విద్య పడగల క్రింద నడుస్తోంది. అది టీచర్లనీ, విద్యార్థులనీ కాటు వేస్తోంది. తల్లిదండ్రులు పిల్లలను కొడుతున్నారు. తల్లిని తండ్రి కొడుతున్నాడు. కొట్టటం అనేది కుటుంబంలో ఉంది, సమాజంలో ఉంది. అదే బడిలోకి వచ్చింది. దండన లేని సమాజం ఉన్నప్పుడు దండన లేని బడి ఉంటుంది. శిక్షణా? - శిక్షా అనేది హింస లేని సమాజాన్ని ఆవిష్కరించుకొన్నపుడు సాధ్యమవుతుంది.
డాక్టర్ వీరేందర్, క్లినికల్ సైకాలజిస్ట్
బడిలో బడి వాతావరణం లేదు. వసతులూ లేవు. బడిని ఒక పూల తోటలా నిర్వహించాలి.
రాఘవాచారి, మోడల్ టీచర్
ఉపాధ్యాయులనే బాధ్యులను చేయటం సరికాదు
వెంకట రెడ్డి, అధ్యక్షుడు, పిఆర్‌టియు
ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:30 ఉంటే సర్వ శిక్షా అభియాన్‌లో చెప్పినట్లు ఆటపాటలతో బోధించటం సాధ్యమవుతుంది. ఒకరిద్దరు ఉపాధ్యాయులే మొత్తం పాఠశాలను కంట్రోల్ చేయటం కష్టం. దండన వెనుక ఉన్న కారణాలను కనుగొనాలి. ప్రభుత్వమే పరిష్కార మార్గం వెతకాలి.
వెంకటేశ్వర రావు, కార్యదర్శి, ఎపి యుటిఎఫ్
కక్ష తోనో, కసి తోనో ఉపాధ్యాయులు విద్యార్థులను దండించాలని అనుకోరు. ప్రభుత్వ పరంగా సదుపాయాలు, సిబ్బందిని కల్పించక పోవటం ఒక కారణం. రాష్ట్రంలో 1100 మండలాలు ఉంటే 800 మండలాలలో ఎంఇఓలు లేరు.
కె.నర్సింహా రెడ్డి, అధ్యక్షుడు, ఎస్‌టియు
ఆరేడు సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల వద్ద పనిష్‌మెంట్ రిజిస్టర్ కూడా ఉండేది. విద్యార్థులను ఎలా దండించాలి? ఎక్కడ కొట్టాలి? ఎలా కొట్టాలి వంటి వివరాలను ఉపాధ్యాయులకు తెలియజేసేవారు. అంటే దండించటం అనే దానికి చట్టబద్ధత అప్పట్లో ఉన్నట్లే కదా?ఈ పరిస్థితులకు సినిమా, మీడియా, మనం కారణం. మనం ప్రాసెస్‌ను ఎంజాయ్ చేయకుండా కేవలం రిజల్ట్‌ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాం. సమస్యలకు ఇది ఒక కారణం.
సుబ్బారెడ్డి, అధ్యక్షుడు, ఎపిటిఎఫ్ (1938)
వసతులు లేకపోవటం వల్లనే పిల్లలను కొడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు అనటం ఒకరకంగా సోషల్ బ్లాక్ మెయిలింగ్‌తో సమానం.
ప్రస్తుతం ఎవరిని రోల్ మోడల్‌గా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే రోల్ మోడల్‌గా నిలవాలి.
సునీల్ కుమార్, నంది అవార్డు గ్రహీత, సొంత ఊరు చిత్ర దర్శకుడు
Saturday, October 9, 2010
Google Code in
Be sure to check out Frequently Asked Questions about the contest for answers to your questions about participating.Google is hopes to get pre-university students from all over the world involved. Google will announce the mentoring organizations that are participating on November 5. The contest starts on November 22, 2010!
Thursday, October 7, 2010
భాగ్యనగరంలో తగ్గుతున్న గాలి నాణ్యత
200 కోట్ల ఏళ్ల క్రితం భూమ్మీద బిగ్‌బ్యాంగ్
బహుకణజీవులు పుట్టింది అప్పుడే
ఐర్లాండ్ శాస్త్రవేత్తల వెల్లడి
ఆర్కిటిక్ మంచుమాయం
ఆర్కిటిక్‌లో మంచు పొర తగ్గుతోంది. ఆర్కిటిక్ సముద్ర మంచు వేసవిలో కరుగుతుంది. శీతాకాలంలో మళ్లీ పేరుకోవటం సాధారణమే. అయినా, గత 30 ఏళ్లుగా ప్రమాదకర స్థాయిలో మంచు పొర తగ్గుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వేసవిలో మూడో అత్యల్ప స్థాయికి చేరింది. రాబోయే 20-30 ఏళ్లలో వేసవి సమయంలో ఆర్కిటిక్ మంచురహిత ప్రాంతంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేసవి సీజన్‌లో మంచు కరిగే ముప్పు పెరుగుతోందని కొలరాడోలోని జాతీయ మంచు గణాంక కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Tuesday, October 5, 2010
రైలు ప్రమాద నిరోధక పరికరం సిద్ధం
Sunday, October 3, 2010
జాబిల్లిపైకి చైనా ఉపగ్రహం
ప్రతి పంచాయతీలో 17 వేల మొక్కలు
క్రీడా సంబరం 'కామన్వెల్త్'
ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జాక్విస్ రోగ్, భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. సంస్కృతి, ఆధునికత కలగలిసిన కార్యక్రమాలు 2 గంటలపాటు ప్రేక్షకుల్ని కట్టిపారేశాయి. 70 వేల కోట్ల రూపాయల ఈ మెగా కార్యక్రమం ఇది. పన్నెండు రోజులపాటు జరిగే క్రీడా పండుగలో 71 దేశాలకు చెందిన ఏడువేల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.
1050 మంది పాఠశాల విద్యార్థుల నమస్తే నృత్య ప్రదర్శనను 23 భారతీయ భాషల్లో ఏరోస్టాట్‌లో ఆవిష్కరించారు. క్రీడాకారుల పెరేడ్ 71 మంది మహిళలతో ప్రారంభమైంది. అంతా చీరలు కట్టుకొని భారతీయతను, చీరల రంగుల్లో వారివారి దేశాల పతాకాలను ప్రతిబింబించారు. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న అభినవ్ బింద్రా సారథ్యంలో 619 మంది సభ్యుల భారత బృందం ప్రాంగణంలోకి వచ్చినపుడు కేరింతలు కొట్టారు. 71 దేశాల క్రీడాకారుల మార్చ్ సాగింది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్, బాక్సింగ్ వీరుడువిజేందర్‌సింగ్, కుస్తీ యోధుడు సుశీల్ కుమార్‌లు బ్యాటన్‌ను మోసిన వారిలో ఉన్నారు. అనంతరం అన్ని దేశాల పతాకాలు ప్రాంగణంలోకి రాగా, భారత కెప్టెన్ బింద్రా ప్రమాణస్వీకారం చేశారు. 816 మంది ప్రదర్శనకారులు చేసిన సూర్య నమస్కారాలు, క్లిష్టమైన ఆసనాలు అలరించాయి.
Thursday, September 30, 2010
పొడుపు కథల జవాబులు
విప్పితే: కనురెప్పలు!
ల జవాబులు
మామ కాని మామ, ఎవ్వరది?
విప్పితే: చందమామ!
చుట్టింటికి మొత్తే లేదు
జవాబు: కోడి గుడ్డు
నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు
అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
జవాబు: పెదవులు
అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
జవాబు: పెదవులు
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
విప్పితే: కవ్వము!
తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
జవాబు: జాబిలి
దేశదేశాలకు ఇద్దరే రాజులు
జవాబు: సూర్యుడు, చంద్రుడు
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
జవాబు: తేనెపట్టు
తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
జవా:ఉత్తరం
ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
జవాబు: టెంకాయ
అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
జవాబు: తేనె పట్టు
తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
జవాబు: పుస్తకంలో అక్షరాలు
వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
జవాబు: పొలం గట్టు
ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
జవాబు: చీపురు
పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్
మేసేది కాసంత మేత:
కూసేది కొండంత మోత.
జవాబు:తుపాకి/తూట
మూడు కళ్ళ ముసలిదాన్ని
నేనెవరిని?
జవాబు:తాటి ముంజ
బంగారు భరిణలో రత్నాలు:
పగుల గొడితేగాని రావు.
జవాబు:దానిమ్మ పండు.
పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
జవాబు:తన నీడ
మంచం కింద మామయ్యా:,
ఊరికి పోదాం రావయ్య.
జవాబు:చెప్పులు
పలుకుగాని పలుకు :
ఎమిటది?
జవాబు:వక్క పలుకు
నల్లని చేనులో
తెల్లని దారి ఏమిటది?
జవాబు:పాపిడి.
పచ్చ పచ్చని తల్లి:
పసిడి పిల్లల తల్లి:
తల్లిని చీలిస్తే
తియ్యని పిల్లలు
జవాబు:పనస పండు
పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:
తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
జవాబు:మొగలి పువ్వు
నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
జవాబు:దీపం వత్తి
అక్కడిక్కడి బండి అంతరాల బండి:
మద్దూరి సంతలోన మాయమైన బండి.
ఏమిటది?
జవాబు:సూర్యుడు.
అడవిని పుట్టాను,
నల్లగ మారాను:
ఇంటికి వచ్చాను,
ఎర్రగ మారాను:
కుప్పలో పడ్డాను,
తెల్లగ మారాను.
జవాబు:బొగ్గు
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది:
చెంబులో నీళ్ళని,
చెడత్రాగుతుంది.
జవాబు:గంధపుచెక్క
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.
ఎవరు ?
జవాబు:గడప
అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది,
తైతక్కలాడింది.
ఎవరు?
జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు.
అన్నదమ్ములం ముగ్గురం మేము,
శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము:
అయితే బుద్ధులు వేరు --
నీళ్ళలో
మునిగే వాడొకడు:
తేలే వాడొకడు;
కరిగే వాదొకడు:
అయితే మే మెవరం?
జవాబు: ఆకు, వక్క, సున్నం.
అమ్మ కడుపున పడ్డాను,
అంత సుఖమున్నాను:
నీచే దెబ్బలు తిన్నను,
నులువునా ఎండిపోయాను:
నిప్పుల గుండం తొక్కాను:
గుప్పెడు బూడిదనైనాను.
జవాబు:పిడక
ఆకసమంతా అల్లుకు రాగా:
చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:
కడివెడు నీరు కారుకు రాగా:
అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
జవాబు: గానుగ
ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,
కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
జవాబు:కల్లు
ఆమడ నడిచి అల్లుడొస్తే,
మంచం కింద ఇద్దరూ,
గోడ మూల ఒకరూ,
దాగుకున్నారు.
జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర
ఇంతింతాకు బ్రహ్మంతాకు
పెద్దలు పెట్టిన పేరంటాకు.
జవాబు: మంగళ సూత్రం
ఇంతింతాకు ఇస్తరాకు
రాజులు మెచ్చిన రత్నాలాకు.
జవాబు: తామలపాకు.
ఇక్కడి నుంచి చూస్తే యినుము;
దగ్గరికి పోతే గుండు;
పట్టి చూస్తే పండు;
తింటే తీయగనుండు.
జవాబు: తాటిపండు.
ఊరంతకీ ఒక్కటే దుప్పటి
జవాబు: ఆకాశం
ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చెప్పులు
ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చీపురు
ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి.
జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.
ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
జవాబు: మిరపచెట్టు.
ఏడుగురు అన్నదమ్ములం మేము;
విడివిడిగా వుంటే చెప్పలేవు ,
కలసి వుంటే చెప్పగలవు.
జవాబు: ఇంద్రధనస్సు
తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు.
జవాబు: పనసకాయ
గోడమీద బొమ్మ
గొలుసుల బొమ్మ
వచ్చి పోయే వారికి
వడ్డించు బొమ్మ.
జవాబు: తేలు.
చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
జవాబు: టెంకాయ .
ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.
జవాబు: సైకిలు డబ్బా నిండ ముత్యాలు,డబ్బాకు తాళం. ఏమిటది ? జవాబు: దానిమ్మ కాయ.
పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
జవాబు: దీపం
అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
జవాబు:పెదవులు
నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
జవాబు : ఆకాసములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు
వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు
అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !
జవాబు : గాలిపటం
మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారు
చెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ !
జవాబు: నాగలిదున్నే రైతు/-------- ( ఒంకర టింకర -అ, వాని తమ్ముడు -సొ,నల్లగుడ్ళ-- మి, నాలుగు కాళ్ళ--మె,)
భూమిని పోలిన గ్రహం
Wednesday, September 29, 2010
ఐదులక్షల కోట్ల వరకూ 'పై' లెక్కింపు
బడికిపోయి చదువుతా !
నేనూ పెద్దవాడినయితే
పక్క ఇంటి పిల్లవాడు
'బాబ్జీ' అంతవుతా!
వాడివెంట నేను కూడ బడికిపోయి చదువుతా !
పలకమీద అకరాలు పట్టి పట్టి దిద్దుతా !
అచ్చు లాగా రాసుకొచ్చి అమ్మకు చూపిస్తా !
'అల,వల, తల, కల' అన్ని పేర్లు చదువుతా!
అడగగానే మేష్టారికి అప్పచెప్పి తీరుతా !
ఎంత పెద్ద పద్యమైన అంతలోనె వల్లిస్తా !
తడబడకుండా వడిగా తరగతిలో పాడుతా !
గుక్క తిప్పకుండ నేను ఎక్కాలను చదువుతా !
ఒక్క తప్పు లేకుండా లెక్కలన్ని చేస్తా !
నేను పెద్ద పరీక్షలకు నిద్రమాని చదువుతా !
పట్టు పట్టి తరగతిలో
ఫస్టున ప్యాసవుతా !
దేశంలో తొలి విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ
ప్రధాన సమాచార కమిషనర్‌గా ఏఎన్ తివారీ
ఓపెన్‌సోర్స్
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||






























