భారత స్వాతంత్రోద్యమంలో కీలకమైన ఉప్పు సత్యాగ్రహానికి వేదికగా నిలిచిన గుజరాత్‌లోని దండి, దానిపక్కనున్న మూడు గ్రామాలను పర్యావరణపరమైన సున్నిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. నవసరి జిల్లాలోని తీరప్రాంతాలైన దండి, సమాపూర్, మత్వాడ్, ఒంజాల్‌లలో సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ అటవీశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ''ఈ నాలుగు గ్రామాలకున్న చారిత్రక, పర్యావరణ ప్రాధాన్యం దృష్ట్యా ఈ ప్రాంతాన్ని పరిరక్షించడం అవసరం. దీనివల్ల గ్రామాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అన్న గాంధీ సూత్రాలను కూడా పాటించినట్లవుతుంది'' అని పేర్కొంది.