Thursday, December 9, 2010

'డిస్కవరి' యాత్రలో ఎలుకలు


అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యోమనౌక డిస్కవరీ అంతరిక్షంలోకి చివరిసారిగా పయనమైనప్పుడు 16 ఎలుకలు ప్రయాణమయ్యాయి.  అంతరిక్ష యాత్రల వల్ల వ్యోమగాముల రోగనిరోధకశక్తి తాత్కాలికంగా క్షీణించడానికి కారణాలను వెతికి పట్టుకునే ప్రయోగంలో భాగంగా వీటిని రోదసిలోకి పంపుతున్నారు. అంతరిక్ష యాత్రల కారణంగా వ్యోమగాముల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి. వైరస్‌, బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ల బారిన పడడాన్ని నాసా 25 ఏళ్ల నుంచి గమనిస్తోంది. తాజా ప్రయోగాన్ని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంతో పాటు నాసాకు చెందిన ఏమ్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాయి.