skip to main |
skip to sidebar
శబ్ద కాలుష్యానికి అడ్డుకట్ట
10:39 PM
Vikasa Dhatri
శబ్ద కాలుష్యానికి అడ్డుకట్ట
వచ్చే దీపావళి నాటికి ప్రత్యేక వ్యవస్థ న్యూఢిల్లీ: వచ్చే దీపావళి నాటికి శబ్ద కాలుష్యాన్ని పర్యవేక్షించే విస్తృత నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దీనిని ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో పరిసర శబ్ద స్థాయిలను నియంత్రించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 160 శబ్ద నియంత్రణ కేంద్రాలను నిర్మిస్తారు. ''వచ్చే దీపావళి నాటికి వ్యవస్థ సిద్ధం అవుతుంది. దేశంలో ఏ ప్రాంతంలో శబ్ద కాలుష్యం స్థాయిలు ఏవిధంగా ఉన్నాయన్న వాస్తవ కాల సమాచారాన్ని ఈ ప్రత్యేక వ్యవస్థ అందిస్తుంది'' అని సీపీసీబీ ఛైర్మన్ ఎస్పీ గౌతం వెల్లడించారు.