skip to main |
skip to sidebar
సంక్షేమంలో భారత్‌కు 88వ స్థానం
10:11 PM
Vikasa Dhatri
సంక్షేమంలో భారత్‌కు 88వ స్థానం న్యూఢిల్లీ: అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించిన ప్రపంచదేశాల జాబితాలో భారత్ 88వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే పదిస్థానాల దిగువకు పడిపోయింది. సంపద, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు తదితర 89 అంశాల ఆధారంగా లండన్‌కు చెందిన లెజిటం ఇన్‌స్టిట్యూట్ అనే పరిశోధన సంస్థ ఈ జాబితాను ఏటా విడుదల చేస్తోంది. ఈసారి మొత్తం 110 దేశాల స్థితిగతులను పరిశీలించింది. తొలిస్థానాన్ని నార్వే కైవసం చేసుకోగా ఆ తర్వాత స్థానాల్లో వరుసగా డెన్మార్క్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నిలిచాయి. పొరుగునున్న చైనా 58వ స్థానం దక్కించుకుంది. మనదేశం విషయానికొస్తే ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వపాలనకు సంబంధించి మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ.. విద్య, ఆరోగ్యం, సామాజికపెట్టుబడి, అవకాశాలు మొదలైన విభాగాల్లో మార్కులు సంపాదించుకోలేకపోయింది. ఆరోగ్యం విషయంలో భారత్ దారుణమైన స్థితిలో ఉందని పౌష్టికాహారాన్ని అందించటంలో, వ్యాధుల నియంత్రణలో విఫలమైందని నివేదిక పేర్కొంది.