Monday, December 20, 2010

సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు


ఒక్క రోజులో మీరు ఎన్ని ఎస్ ఎం ఎస్ లు పంపుతారు? లేదా ఒక్క నెలలో ఎన్ని సందేశాలు పంపుతారు? 
భావ వ్యక్తీకరణకు సంక్షిప్త సందేశానికి (ఎస్సెమ్మెస్‌) మించిన సాధనం లేదని భావిస్తున్న రోజులు ఇవి. ఎస్ ఎం ఎస్ ల సంఖ్య రోజు రోజుకు చాంతాడులా పెరిగిపోతోంది. ఇపుడు ప్రతి సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు ఇతరులకు చేరుతున్నాయని ఐక్య రాజ్య సమితి (ఐరాస) దూర ప్రసార సంస్థ వెల్లడించింది. మూడేళ్లలో ఇది మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2007లో 1.8 ట్రిలియన్‌ సంక్షిప్త సందేశాలు నమోదయ్యాయి. అది 2010 వచ్చేసరికి 6.1 ట్రిలియన్‌ దాటింది. వీటి కోసం ప్రజలు సెకనుకు రూ.6.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 2009 లెక్కల ప్రకారం సంక్షిప్త సందేశాలతో కాలం గడిపేవారిలో ఫిలిప్పీన్స్‌, అమెరికన్లు ముందున్నారు.