Thursday, September 30, 2010

పొడుపు కథల జవాబులు

కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
విప్పితే: కనురెప్పలు!
 ల జవాబులు
మామ కాని మామ, ఎవ్వరది?
విప్పితే: చందమామ!

చుట్టింటికి మొత్తే లేదు
జవాబు: కోడి గుడ్డు

నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
జవాబు: బర్రె(గేదె, ఎనుము) క్రింది పొదుగులు

అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
జవాబు: పెదవులు

అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
జవాబు: పెదవులు

అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
విప్పితే: కవ్వము!

తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
జవాబు: జాబిలి

దేశదేశాలకు ఇద్దరే రాజులు
జవాబు: సూర్యుడు, చంద్రుడు

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
జవాబు: తేనెపట్టు

తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
జవా:ఉత్తరం

ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
జవాబు: టెంకాయ

అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
జవాబు: తేనె పట్టు

తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
జవాబు: పుస్తకంలో అక్షరాలు

వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
జవాబు: పొలం గట్టు

ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
జవాబు: చీపురు

పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
జవాబు: టెలిఫోన్/సెల్ ఫోన్

మేసేది కాసంత మేత:
కూసేది కొండంత మోత.
జవాబు:తుపాకి/తూట

మూడు కళ్ళ ముసలిదాన్ని
నేనెవరిని?
జవాబు:తాటి ముంజ

బంగారు భరిణలో రత్నాలు:
పగుల గొడితేగాని రావు.
జవాబు:దానిమ్మ పండు.

పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
జవాబు:తన నీడ
మంచం కింద మామయ్యా:,
ఊరికి పోదాం రావయ్య.
జవాబు:చెప్పులు

పలుకుగాని పలుకు :
ఎమిటది?
జవాబు:వక్క పలుకు

నల్లని చేనులో
తెల్లని దారి ఏమిటది?
జవాబు:పాపిడి.

పచ్చ పచ్చని తల్లి:
పసిడి పిల్లల తల్లి:
తల్లిని చీలిస్తే
తియ్యని పిల్లలు
జవాబు:పనస పండు

పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:
తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
జవాబు:మొగలి పువ్వు

నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
జవాబు:దీపం వత్తి

అక్కడిక్కడి బండి అంతరాల బండి:
మద్దూరి సంతలోన మాయమైన బండి.
ఏమిటది?
జవాబు:సూర్యుడు.

అడవిని పుట్టాను,
నల్లగ మారాను:
ఇంటికి వచ్చాను,
ఎర్రగ మారాను:
కుప్పలో పడ్డాను,
తెల్లగ మారాను.
జవాబు:బొగ్గు

అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది:
చెంబులో నీళ్ళని,
చెడత్రాగుతుంది.
జవాబు:గంధపుచెక్క

 అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి.
ఎవరు ?
జవాబు:గడప

అడవిలో పుట్టింది,
అడవిలో పెరిగింది;
మా ఇంటి కొచ్చింది,
తైతక్కలాడింది.
ఎవరు?
జవాబు : మజ్జిగను చిలికే తెడ్డు.

అన్నదమ్ములం ముగ్గురం మేము,
శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము:
అయితే బుద్ధులు వేరు --
నీళ్ళలో
మునిగే వాడొకడు:
తేలే వాడొకడు;
కరిగే వాదొకడు:
అయితే మే మెవరం?
జవాబు: ఆకు, వక్క, సున్నం.

అమ్మ కడుపున పడ్డాను,
అంత సుఖమున్నాను:
నీచే దెబ్బలు తిన్నను,
నులువునా ఎండిపోయాను:
నిప్పుల గుండం తొక్కాను:
గుప్పెడు బూడిదనైనాను.
జవాబు:పిడక

ఆకసమంతా అల్లుకు రాగా:
 చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:
కడివెడు నీరు కారుకు రాగా:
అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
జవాబు: గానుగ

 ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,
కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
జవాబు:కల్లు

ఆమడ నడిచి అల్లుడొస్తే,
మంచం కింద ఇద్దరూ,
గోడ మూల ఒకరూ,
దాగుకున్నారు.
జవాబు: చెప్పుల జోడు, చేతి కర్ర

ఇంతింతాకు బ్రహ్మంతాకు
పెద్దలు పెట్టిన పేరంటాకు.
జవాబు: మంగళ సూత్రం

ఇంతింతాకు ఇస్తరాకు
రాజులు మెచ్చిన రత్నాలాకు.
జవాబు: తామలపాకు.

ఇక్కడి నుంచి చూస్తే యినుము;
దగ్గరికి పోతే గుండు;
పట్టి చూస్తే పండు;
తింటే తీయగనుండు.
జవాబు: తాటిపండు.

ఊరంతకీ ఒక్కటే దుప్పటి
జవాబు: ఆకాశం

ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చెప్పులు
ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
జవాబు: చీపురు

ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి.
జవాబు: చాకలి, రోకలి, వాకలి, ఆకలి.
ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
జవాబు: మిరపచెట్టు.

ఏడుగురు అన్నదమ్ములం మేము;
విడివిడిగా వుంటే చెప్పలేవు ,
కలసి వుంటే చెప్పగలవు.
జవాబు: ఇంద్రధనస్సు

తండ్రి గరగర,
తల్లి పీచుపీచు,
బిడ్డలు రత్నమాణిక్యాలు,
మనుమలు బొమ్మరాళ్ళు.
జవాబు: పనసకాయ

గోడమీద బొమ్మ
గొలుసుల బొమ్మ
వచ్చి పోయే వారికి
వడ్డించు బొమ్మ.
జవాబు: తేలు.

చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
జవాబు: టెంకాయ .

ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.
జవాబు: సైకిలు డబ్బా నిండ ముత్యాలు,డబ్బాకు తాళం. ఏమిటది ? జవాబు: దానిమ్మ కాయ.

పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
జవాబు: దీపం

అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
జవాబు:పెదవులు

నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
జవాబు : ఆకాసములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు
వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచు
అంబరమున దిరుగు నది యేమిచోద్యమో - విశ్వదాభిరామ వినురవేమ !
జవాబు : గాలిపటం

మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారు
చెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ  !
జవాబు: నాగలిదున్నే రైతు/-------- ( ఒంకర టింకర -అ, వాని తమ్ముడు -సొ,నల్లగుడ్ళ-- మి, నాలుగు కాళ్ళ--మె,)

భూమిని పోలిన గ్రహం

భూమి లాంటి గ్రహం మరొకటి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఈ గ్రహం భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక తార చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి గ్లీస్‌ 581జీ అని పేరు పెట్టారు. ఈ గ్రహం భూమి కంటే 3 రెట్లు పెద్దగా ఉంది. ఈ గ్రహంపై రాత్రి, పగలు ఉండవు. ఈ గ్రహం పై  భూమి తరహాలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.  జీవం మనగడకు అనువైన పరిస్థితులూ ఉన్నాయని నీరూ ఉండొచ్చని చెప్పారు.  హవాయ్‌లోని డబ్ల్యూఎం కెక్‌ అబ్జర్వేటరీలో 11 ఏళ్ల పాటు పరిశీలనలు జరిపి ఈ గ్రహం తీరుతెన్నులను గమనించారు.

Wednesday, September 29, 2010

ఐదులక్షల కోట్ల వరకూ 'పై' లెక్కింపు


గణితశాస్త్రంలో వృత్తం చుట్టుకొలత, వ్యాసం నిష్పత్తినే 'పై' అంటారు. దీనిని 22/7గా పేర్కొంటారు. 'పై'ని ఎంత భాగించినా శేషం వస్తూనే ఉంటుందని మనకు తెలుసు. జపాన్‌కు చెందిన ఒక ఇంజినీర్‌ సొంతంగా రూపొందించిన కంప్యూటర్‌ను ఉపయోగించి 'పై' విలువను ఐదులక్షల కోట్ల (ఐదు ట్రిలియన్లు) వరకూ లెక్కించారు.  ఒక ఫ్రెంచి ఇంజినీర్‌ గత ఏడాది నమోదు చేసిన రికార్డును (2.7 ట్రిలియన్లు) బద్దలు కొట్టారు. ఒక ఆహార ఉత్పత్తుల సంస్థలో ఇంజినీర్‌గా పని చేస్తున్న షిగెరు కొండొ 'పై' విలువను వీలైనన్ని ఎక్కువ స్థానాల వరకూ లెక్కించటానికి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసం 32 టెరాబైట్ల హార్డ్‌డ్రైవ్‌తో సొంతంగా కంప్యూటర్‌ను తయారుచేశారు. అనంతరం 5ట్రిలియన్ల స్థానాలవరకూ పై విలువను లెక్కించారు.

బడికిపోయి చదువుతా !


నేనూ పెద్దవాడినయితే 
పక్క ఇంటి పిల్లవాడు
'బాబ్జీ' అంతవుతా!
వాడివెంట నేను కూడ బడికిపోయి చదువుతా !
పలకమీద అకరాలు పట్టి పట్టి దిద్దుతా !
అచ్చు లాగా రాసుకొచ్చి అమ్మకు చూపిస్తా !
'అల,వల, తల, కల' అన్ని పేర్లు చదువుతా!
అడగగానే మేష్టారికి అప్పచెప్పి తీరుతా !
ఎంత పెద్ద పద్యమైన అంతలోనె వల్లిస్తా !
తడబడకుండా వడిగా తరగతిలో పాడుతా !
గుక్క తిప్పకుండ నేను ఎక్కాలను చదువుతా !
ఒక్క తప్పు లేకుండా లెక్కలన్ని చేస్తా !
నేను పెద్ద పరీక్షలకు నిద్రమాని చదువుతా !
పట్టు పట్టి తరగతిలో 
ఫస్టున ప్యాసవుతా !

దేశంలో తొలి విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ



 782474317884... 
ఈ పన్నెండంకెల సంఖ్య - కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఆధార్‌' ప్రాజెక్టులో భాగంగా జారీ చేసిన మొట్టమొదటి విశిష్ట గుర్తింపు (యూఐడీ) సంఖ్య. మహారాష్ట్రకు చెందిన రజనా సోనావానే అనే గిరిజన మహిళకు ఈ సంఖ్యను కేటాయించారు. దీంతో రజనా దేశంలోనే మొదటి విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందిన మహిళగా నిలిచారు. ఈ సంఖ్యే ఆమెకు జీవితాంతం అధికారిక గుర్తింపుగా ఉండిపోతుంది. ఇదే విధంగా భారత దేశం లోని పౌరులందరికీ విశిష్ట గుర్తింపు (యూఐడీ) సంఖ్యను కేటాయించనున్నారు. 
ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీలు 29 సెప్టెంబర్ న నందర్బార్‌ జిల్లాలోని తెంబ్లీ గిరిజన గూడెంలో 'ఆధార్‌' ప్రాజెక్టును ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో కార్డుల రూపశిల్పి 'యునీక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా' చీఫ్‌ నందన్‌ నిలేకని కూడా పాల్గొన్నారు.  ''చాలామంది పేదలకు ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవు. దీంతో వారు బ్యాంకులో ఖాతా తెరవడానికైనా, రేషన్‌ పొందడానికైనా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధినీ పొందలేకపోతున్నారు. అవన్నీ దారిమళ్లి దళారులు, ఇతరుల జేబుల్లోకి వెళుతున్నాయి. ఈ కార్డులతో ఆ సమస్యలు తొలగుతాయి'' అని ఈ సందర్భంగా  ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు.

ప్రధాన సమాచార కమిషనర్‌గా ఏఎన్‌ తివారీ

ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా ఉన్న అనుగ్రహ నారాయణ్‌ తివారీ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. 1969 బ్యాచ్‌, ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఈ మాజీ ఐఏఎస్‌ అధికారి గతంలో సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో పనిచేశారు. ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్‌గా ఉన్న వజహత్‌ హబీబుల్లా ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ చేశారు. పార్టీల ఆదాయపు పన్ను రిటర్నులను ప్రజలు పరిశీలించవచ్చన్నది సమాచార కమిషనర్‌గా తివారీ తీసుకొన్న కీలక నిర్ణయాల్లో ఒకటి. 1945 డిసెంబరు 19న ఒరిస్సాలో జన్మించిన తివారీ నల్గొండజిల్లా భువనగిరి సబ్‌కలెక్టరుగా పనిచేశారు. తర్వాత గుంటూరులో వాణిజ్య పన్నుల విభాగం ఉప కమిషనర్‌గా, కడప, వరంగల్‌ జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్‌గా వ్యవహరించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా, గవర్నర్‌ కార్యదర్శిగా, ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేశారు.  2005 డిసెంబరు 25న ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ చెందారు. అదే తేదీ నుంచి ఆయన కేంద్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్‌గా కొనసాగుతున్నారు. ఆయన గురించిన మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. 

ఓపెన్‌సోర్స్






























































ఓపెన్‌సోర్స్‌లో అందరికీ అన్నీ!
పిల్లలకు ఆటలు.. విద్యార్థులకేమో పాఠాలు.. డిజైనర్లకు సాఫ్ట్‌వేర్‌లు.. ఉద్యోగులకు ఉచిత ఆఫీస్‌లు.. పెద్దలకు వీడియోలు.. పీసీ రక్షణకు ప్రత్యేక చిట్కాలు.. అన్నీ ఒకే చోటే!
కొత్త పీసీ కొంటాం. ఎవరి ఆసక్తుల మేరకు ఇంట్లో పోటీ. ఆటల కోసం ఒకరు, ఉచిత సాఫ్ట్‌వేర్‌ల కోసం మరొకరు, సమాచారం కోసం ఇంకొకరు వెతుకులాట. మరయితే ఓపెన్‌ సోర్స్‌ కమ్యూనిటీ అందరి అవసరాలు తీర్చేలా సాఫ్ట్‌వేర్‌లు, వీడియో గేమ్స్‌, ఆఫీస్‌ అప్లికేషన్స్‌, సిస్టం సెక్యూరిటీ, మెదడుకు పదును పెట్టే ఆటలు... ఇలా అన్నీ ఒకేచోట అందిస్తోందని మీకు తెలుసా? అదే SchoolForge.net. ప్రధానంగా విద్యార్థులకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌లను రూపొందించడం దీని ప్రత్యేకత. ఉద్యోగుల ఆఫీస్‌ పనుల్ని మరింత సులభతరం చేసే అప్లికేషన్స్‌ అందుబాటులో ఉంచారు. సృజనాత్మకత కలిగి డిజైనింగ్‌ రంగాన్ని ఎంచుకునే విద్యార్థులకు మల్టీమీడియా అప్లికేషన్స్‌ పొందుపరిచారు. పీసీ సామర్థ్యాన్ని మరింత పెంచే యుటిలిటీ అప్లికేషన్స్‌ అందిస్తున్నారు.
ఆటల్లోనే చదువు! పిల్లల కోసం విజ్ఞానదాయకమైన ఆటల్ని రూపొందించారు. ఉదాహరణకి సెలిస్టియా ఆటని ఆడుతూనే విశ్వం గురించి తెలుసుకోవచ్చు. సౌర కుటుంబాన్ని చుట్టేసి రావచ్చు. నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కలు, ఉపగ్రహాల్ని ఎక్స్‌ప్లోర్‌ చేయవచ్చు. రెండు నుంచి పదేళ్ల పిల్లల్ని ఆకట్టుకునేందుకు GCompris కలెక్షన్‌ను రూపొందించారు. దీంట్లో క్విజ్‌లు, రంగుల్ని గుర్తించే ఆటలు, చదరంగం, బీజగణితం, భూగర్భశాస్త్రం, అంకెల గారడీ లాంటివి బోలెడు. ఆకర్షణీయమైన కార్టూన్లతో ఆటల్ని రూపొందించారు. అక్షరాల రూపంలో చేపలు పై నుంచి పడుతుంటాయి. వాటిని టైప్‌ చేస్తుంటే కింది ఉన్న పెంగ్విన్‌ వాటిని చక్కగా ఆరగించేస్తుంది. టక్స్‌మ్యాథ్స్‌ ఆటలో లెక్కలు చేయవచ్చు. టక్స్‌పెయింట్‌తో బొమ్మలు గీయొచ్చు. ఎక్కాల్ని కంఠస్తం చేయడానికి మల్టిప్లికేషన్‌ స్టేషన్‌ గేమ్‌ని తయారు చేశారు. మొత్తం ఆటల్ని లినక్స్‌, విండోస్‌, మ్యాక్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంచారు. వివరాలకు http://tinyurl.com/education222
* మరిన్ని ఆటల కోసం http:// osswin. source forge.net/games.html
సృజనాత్మకత ఉందా? ఆకట్టుకునేలా గ్రాఫిక్‌ని రూపొందించడం సృజనాత్మకతతో కూడిన కళ. ఇలాంటి గ్రాఫిక్స్‌ని 3డీలో క్రియేట్‌ చేయాలంటే వేల రూపాయలు పోసి మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లు కొనక్కర్లేదు. ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరి! Art of Illusion త్రీడీ మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో గ్రాఫిక్స్‌ని రూపొందించవచ్చు. ఓపెన్‌సోర్స్‌ గ్రాఫిక్స్‌ ఎడిటర్‌గా పేరొందించిన మరో మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌ Inkscape. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొరల్‌డ్రా, Adobe Illustrator, Xara X... లాంటి కమర్షియల్‌ సాఫ్ట్‌వేర్‌లతో సమానంగా దీన్ని వాడుకోవచ్చు. సరికొత్త ఆప్షన్లతో మెనూబార్‌, టూల్‌బార్‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు కొత్త వెర్షన్‌తో డిజైనర్లను ఆకర్షిస్తున్న బ్లెండర్‌ 2.52 బీటాతో మరింత ఆకర్షణీయంగా డిజైన్లు రూపొందించవచ్చు. తెరపై మీరు చేస్తున్న పనిని ఆడియో, వీడియో రూపంలో రికార్డ్‌ చేయాలంటే CamStudioతో చేయవచ్చు. వివిధ ఫార్మెట్‌ల్లో ఉన్న వీడియోలను ఎడిట్‌ చేసుకునేందుకు Avidemux నిక్షిప్తం చేశారు. http://tinyurl.com/multimedia222
* మరిన్ని ఉచిత సాఫ్ట్‌వేర్‌లకు www.opensourcewindows.org
ఉద్యోగులకు ప్రత్యేకం ఇంట్లో ఆఫీస్‌ డాక్యుమెంట్‌లను తయారు చేయాలంటే ఎమ్మెస్‌ ఆఫీస్‌ను కొనక్కర్లేదు. NeoOffice డౌన్‌లోడ్‌ చేసుకుని వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్స్‌ను తయారు చేయవచ్చు. ఇప్పటికే అనేక మందికి సుపరిచితమైన 'ఓపెన్‌ఆఫీస్‌' కూడా పొందొచ్చు. మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌లో మాదిరిగానే డాక్యుమెంట్‌ను రూపొందించాలంటే Abiword నిక్షిప్తం చేసుకోండి. వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్ని నమోదు చేసేందుకు GNUCash డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌ ఫైల్స్‌ని సులభంగా వీక్షించేందుకు సుమత్రా పీడీఎఫ్‌ పొందొచ్చు. సన్‌బర్డ్‌ క్యాలెండర్‌ను కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. http://tinyurl.com/office-tools
ఇలా పీసీ పరిరక్షణ పీసీకి రక్షణ వలయంలా పని చేసే యాంటీ వైరస్‌, స్పైవేర్‌లు ఓపెన్‌సోర్స్‌లో కూడా ఉన్నాయని తెలుసా? అయితే, ClamWin, Winpoochల గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణ యాంటీ వైరస్‌ల మాదిరిగానే ఇవి పని చేస్తాయి. విండోస్‌ 7, విస్టా, ఎక్సెపీ, 2000, 98, విండోస్‌ సర్వర్‌ 2008, 2003 ఓఎస్‌ల్లో Clamwin యాంటీ వైరస్‌ను వాడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,00,000 వినియోగదారులు వాడుతున్నారు. యాంటీవైరస్‌ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అయ్యేలా పెట్టుకోవచ్చు. షెడ్యూల్‌ స్కానింగ్‌ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక winpooch తో ట్రోజన్స్‌, మాల్వేర్‌, స్పైవేర్‌ల పని పట్టొచ్చు. http://tinyurl. com/antivirus-spyware
వీడియో ఏదైనా! ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విశేషాల్ని టీవీలో మాదిరిగా చూడాలనుకుంటే Miro Video Playerను దిగుమతి చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసిన ప్లేయర్‌తో ఆన్‌లైన్‌ వీడియో షేరింగ్‌ సర్వీసుల్లోని వీడియోలను వెతికి వీక్షించవచ్చు. నచ్చిన వాటిని లైబ్రరీగా పెట్టుకోవచ్చు. హై డెఫినెషన్‌ వీడియోలకు కూడా అనువు.
* ఒకవేళ ఆయా సాఫ్ట్‌వేర్‌లు స్కూల్‌ఫర్జ్‌ నుంచి డౌన్‌లోడ్‌ కాకుంటే వాటిని రూపొందించిన నిపుణుల సైట్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఉదాహరణకు Gcompris ఎడ్యుకేషనల్‌ గేమ్‌ డౌన్‌లోడ్‌ కాకుంటే అదే పేరుతో గూగుల్‌ సెర్చ్‌లో వెతికి http://gcompris.net/-download- హోం సైట్‌ నుంచి దిగుమతి చేసుకోండి.
* ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీలో మీరు సభ్యులవ్వాలంటే www.schoolforge.net/education-software

Tuesday, September 28, 2010

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం

పొడుపు కథలు. పొడుపు కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పిల్లలు, పెద్దలలో ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. వినోదాన్నీ ఇస్తాయి. మానసిక వికాసాన్నీ కలిగిస్తాయి. చాలా పొడుపు కథలు కనుమరుగై పోయినా, కాల గర్భంలో కలిసి పోయినా, ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో వీటికి ఆదరణ ఎంతో ఉంది.

మీ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పొడుపు కథలను వ్రాసి బాల చెలిమికి పంపండి. మీ పేరు, ఫోటో కూడా జత చేసి పంపండి. వెంటనే బాల చెలిమిలో ప్రచురిస్తాం.  


ఇక్కడ కొన్ని పొడుపు కథలు ఇస్తున్నాం. వీటిని విప్పే ప్రయత్నం చేయండి.

    1 కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?
    2 మామ కాని మామ, ఎవ్వరది?
    3 చుట్టింటికి మొత్తే లేదు
    4 నల్ల బండ క్రింద నలుగురు దొంగలు
    5 అమ్మ అంటే కదులుతాయి, నాన్న అంటే కదలవు
    6 అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు
    7 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది
    8 తెల్లటి బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి
    9 దేశదేశాలకు ఇద్దరే రాజులు
    10 చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
    11 తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది
    12 ఆకాశాన అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్ళు
    13 అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ
    14 తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు: చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు
    15 వంరి వంకల రాజు, వళ్ళంతా బొచ్చు
    16 ఇల్లంతా తిరుగుతుంది, మూలన కూర్చుంటుంది
    17 పిడికెడంత పిట్ట! అరిచి గోల చేస్తుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెబుతుంది.
    18 మేసేది కాసంత మేత: కూసేది కొండంత మోత.
    19 మూడు కళ్ళ ముసలిదాన్నినేనెవరిని?
    20 బంగారు భరిణలో రత్నాలు: పగుల గొడితేగాని రావు.
    21 పొంచిన దెయ్యం పోయిన చోటికల్లా వస్తుంది?
    22 మంచం కింద మామయ్యా:,ఊరికి పోదాం రావయ్య.
    23 పలుకుగాని పలుకు :ఎమిటది?
    24 నల్లని చేనులో తెల్లని దారి ఏమిటది?
    25 పచ్చ పచ్చని తల్లి: పసిడి పిల్లల తల్లి: తల్లిని చీలిస్తే తియ్యని పిల్లలు
    26 పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది: తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది?
    27 నోరులేని పిట్ట తోకతో నీళ్ళు తాగుతుంది.ఏమిటది?
    28 అక్కడిక్కడి బండి అంతరాల బండి: మద్దూరి సంతలోన మాయమైన బండి.ఏమిటది?
    29 అడవిని పుట్టాను, నల్లగ మారాను: ఇంటికి వచ్చాను, ఎర్రగ మారాను: కుప్పలో పడ్డాను, తెల్లగ మారాను.
    30 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది: చెంబులో నీళ్ళని, చెడత్రాగుతుంది.
    31 అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది; మా ఇంటి కొచ్చింది మహలక్ష్మి. ఎవరు ?
    32 అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము: అయితే బుద్ధులు వేరు -- నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు; కరిగే వాదొకడు: అయితే మే మెవరం?
    33 అమ్మ కడుపున పడ్డాను,అంత సుఖమున్నాను:నీచే దెబ్బలు తిన్నను,నులువునా ఎండిపోయాను:నిప్పుల గుండం తొక్కాను:గుప్పెడు బూడిదనైనాను.
    34 ఆకసమంతా అల్లుకు రాగా:చేటెడు చెక్కులు చెక్కుకు రాగా:కడివెడు నీరు కారుకు రాగా:అందులో ఒక రాజు ఆడుతుంటాడు.
    35 ఆకాశ పక్షి ఎగురుతూ వచ్చి,కడుపులో చొచ్చి లేపింది పిచ్చి.
    36 ఆమడ నడిచి అల్లుడొస్తే,మంచం కింద ఇద్దరూ, గోడ మూల ఒకరూ,దాగుకున్నారు.
    37 ఇంతింతాకు బ్రహ్మంతాకుపెద్దలు పెట్టిన పేరంటాకు.
    38 ఇంతింతాకు ఇస్తరాకురాజులు మెచ్చిన రత్నాలాకు.
    39 ఇక్కడి నుంచి చూస్తే యినుము;దగ్గరికి పోతే గుండు;పట్టి చూస్తే పండు;తింటే తీయగనుండు.
    40 ఊరంతకీ ఒక్కటే దుప్పటి
    41 ఊరంతా నాకి మూల కూర్చుండేది - యేది?
    42 ఇల్లంతా నాకి మూల కూర్చుండేది - యేది?
    43 ఊళ్ళో కలి,వీధిలో కలి,ఇంట్లో కలి,ఒంట్లో కలి.
    44 ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు.
    45 ఏడుగురు అన్నదమ్ములం మేము;విడివిడిగా వుంటే చెప్పలేవు ,కలసి వుంటే చెప్పగలవు.
    46 తండ్రి గరగర,తల్లి పీచుపీచు,బిడ్డలు రత్నమాణిక్యాలు,మనుమలు బొమ్మరాళ్ళు.
    47 గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ.
    48 చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం తియ్యగ నుండు.
    49 ఇంతింత బండి - ఇనప కట్ల బండి , తొక్కితే నా బండి - తొంభై ఆమడలు పోతుంది.
    50 పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా
    51 అయ్య అంటే కలవవు, అమ్మ అంటే కలుస్తాయి
    52 నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు
    53 వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు - వ్రేలిమీద నుండి నేలజూచుఅంబరమున దిరుగు నది యేమిచోద్యమో
    54 మూడు శిరములున్ను ముదమొప్ప పది కాళ్ళు - కల్గు తోకలు రెండు కన్ను లారుచెలగి కొమ్ములు నాల్గు చెతులు రెండయా - దీని భావమేమి తిరుమలేశ  !

జవాబుల కోసం ఇక్కడ చూడండి. 

Sunday, September 26, 2010

విద్యార్థుల ఒత్తిడి తగ్గించేలా టీచర్లకు శిక్షణ


విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా హోంవర్క్‌ను, యూనిట్ టెస్ట్‌లను కుదించుకోవాలని నిర్ణయించిన సీబీఎస్ఈ బోర్డు మరో అడుగు ముందుకేసింది. ఇందుకోసం ప్రవేశపెట్టిన కంటిన్యువస్  కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్(సీఎస్ఈ) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంకల్పించింది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విషయంలో ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇలా విభిన్న వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని శిక్షకులను, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను తయారు చేయాలని నిర్ణయించింది. తమ ప్రాజెక్టు వర్క్‌ల్లో మరింత స్వతంత్రంగా వ్యవహరించేలా, ఇచ్చిన పనుల్లో మరింతగా లీనమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కృషి చేస్తారు. అలాగే, తల్లిదండ్రులతో నిరంతరం సంబంధాలు నెరపుతూ పిల్లలపై వారిలో ఉన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. 

రాజీవ్‌ విద్యా మిషన్‌కు విద్యా హక్కు బాధ్యత

విద్యా హక్కు చట్టం పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌ విద్యా మిషన్‌కు అప్పగించింది. ఇందుకోసం రాజీవ్‌ విద్యా మిషన్‌ కార్యకలాపాల గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ప్రాథమిక విద్య బలోపేతానికి 2001-02లో ప్రారంభమైన రాజీవ్‌ విద్యా మిషన్‌ గడువు నిజానికి  2010తో ముగియాలి.  విద్యా హక్కు చట్టం అమలు కోసం ఇప్పుడు రెండేళ్ల పొడిగింపు లభించింది.   రాజీవ్‌ విద్యా మిషన్‌కు 2010-11 ఆర్థిక సంవత్సరానికి రూ.1100 కోట్లను కేటాయించారు. తాజాగా విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి మరో రూ.660 కోట్లు కేంద్రం నుంచి పొందాలని ప్రాథమిక విద్యాశాఖ ప్రతిపాదనలను రూపొందించింది.
విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు వంతున సర్దుబాటు చేయాలి. దీని ప్రకారం సుమారు 20వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అధికారుల అంచనా. మరోవైపు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే 70లక్షల మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. జతకు రూ.200 వంతున వ్యయం చేయనున్నారు. 
బాలల హక్కులను పర్యవేక్షించేందుకు 'రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ'ని ఏర్పాటు చేయనున్నారు.  అథారిటీ బాధ్యతలను హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన విద్యావేత్తకు అప్పగించాలని నిబంధనలు చెబుతున్నాయి.

ఇంటర్నెట్ వీక్షణలో సెల్‌ఫోన్లు ముందంజ

ఇంటర్నెట్ వీక్షణలో పీసీలను వెనక్కు నెట్టి సెల్‌ఫోన్లు ముందంజ లోకి చేరుకున్నాయి.  నిన్న గాక మొన్న వచ్చిన సెల్‌ఫోన్లు ఇంటర్నెట్ వీక్షణలో పీసీలను వెనక్కు నెట్టేస్తున్నాయి. కేవలం ఫోన్ సంభాషణ జరపడం, ఎస్సెమ్మెస్‌లు పంపడం అన్న పరిధి నుంచి సెల్‌ఫోన్ లు విస్తరించి  పీసీల పనిని కూడా చేస్తున్నాయి.
తాజాగా జరిపిన ఓ సర్వే ప్రకారం ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లో నెటిజన్లు  పీసీల కంటే కూడా సెల్‌ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారని వెల్లడైంది. ఈ-మెయిల్స్ చూసుకోవడం, వార్తలు చదువుకోవడం, క్రీడా వార్తలు తెలుసుకోవడం, సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లను వీక్షించడం వంటి రోజువారీ  అవసరాలకు పీసీల కంటే కూడా సెల్‌ఫోన్ల మీదే ఎక్కువ మంది నెటిజన్లు ఆధారపడుతున్నారని సర్వేలో తెలిసింది.  రెండేళ్ల క్రితం మార్కెట్‌లోకి ఐఫోన్ వచ్చినప్పటి నుంచీ ఈ పరిస్థితి పెరిగిందన్నారు. ఇంటర్నెట్‌ను వీక్షించే మూడు పదుల వయసు వారిలో సగానికి పైగా సెల్‌ఫోన్ పైనే ఆధారపడుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. వారి వద్ద పీసీలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా నెట్ బ్రౌజింగ్ కోసం సెల్‌ఫోన్ల మీదే వీరు ఆధారపడుతున్నట్లు సర్వేలో తెలిసింది. 

మంచినీటి విక్రయాలకు ఐ ఎస్ ఐ ‌ తప్పనిసరి



భారతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) ధ్రువీకరణ బాటిళ్లలో విక్రయించే మంచినీటికి తప్పనిసరిగా ఉండాలని  కేంద్ర ఆహార శాఖ స్పష్టం చేసింది. మినరల్‌ వాటర్‌తో సహా బాటిళ్లలో విక్రయించే అన్ని రకాల మంచినీళ్లకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.  ''మంచినీటి తయారీ, విక్రయం, ప్రదర్శన - వీటిలో ఏది చేయాలన్నా ఆ నీటికి బీఐఎస్‌ ప్రమాణాల ధ్రువీకరణ తప్పనిసరి'' అని ఆహారశాఖ పేర్కొన్నది. సాధారణ తాగునీటికి ఐఎస్‌ 14543:2004 ప్రమాణాలను, మినరల్‌ వాటర్‌కు 13428:2005 ప్రమాణాలను పాటించాలని తెలిపింది. మినరల్‌ వాటర్‌కు సంబంధించి 18 కంపెనీలకు, రివర్స్‌ ఆస్మాసిస్‌ ద్వారా మంచినీటిని విక్రయిస్తున్న సంస్థలకు 2,354 లైసెన్సులు ఉన్నాయని, సహజసిద్ధంగా లభిస్తున్న మంచినీటిని విక్రయించేందుకు 633 లైసెన్సులు ఉన్నాయని పేర్కొంది. ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.

Thursday, September 23, 2010

మన కోసం ఇక విహంగ విమానం

రెక్కలు కట్టుకొని పిట్టలా వినీలాకాశంలో విహరించాలనుకొనే కల నిజమౌతున్నది. కెనడా శాస్త్రవేత్త అలాంటి ఓ విహంగ విమానాన్ని కనుగొన్నాడు. యంత్రాలతో నిమిత్తం లేకుండా మనం రెక్కలు అల్లార్చుతూ పక్షిలా గాల్లో ఎంచక్కా గిరికీలు కొట్టేయవచ్చు. టొరాంటోలో పీహెచ్‌డీ చేస్తున్న టాడ్‌ రీషెర్ట్‌ రూపొందించిన ఈ విహంగ విమానం పేరు 'స్నోబర్డ్‌'. మనమే దీని మార్గాన్ని, వేగాన్ని నియంత్రించుకోవాలి. కాళ్లతో పెడలింగ్‌చేస్తే దీని రెక్కలు పైకి కిందికీ కదులుతాయి.'స్నోబర్డ్‌' గాలిని ఛేదించుకుంటూ ముందుకు తీసుకెళుతుంది. ఈ రెక్కలను చకచకా కదిలే కప్పీలు,  తాళ్లసాయంతో పెడల్‌కు కలపటం వల్ల పెడలింగ్‌ చేసినపుడు ఇవి వేగంగా కదులుతాయి. టాడ్‌ ప్రయోగాత్మకంగా దీన్నినడిపి 145 మీటర్ల దూరాన్ని 19.3 సెకండ్లలో చేరుకున్నాడు.

బట్ట సంచులను ప్రోత్సహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్

'ప్లాస్టిక్ స్థానంలో బట్ట సంచులను వినియోగించండి. పర్యావరణాన్ని కాపాడండి.  'పచ్చదనం-పరిశుభ్రతను సాధించండి' అనే ఈ నినాదంతో ఎన్టీఆర్ ట్రస్ట్  కార్యక్రమాలను ప్రారంభించబోతోంది. 'ఎన్విరాన్‌మెంట్ అండ్ పీపుల్', 'గ్రీన్ ఆర్కిటెక్ట్స్ అండ్ ప్లానర్స్' సంస్థలతో కలిసి బట్ట సంచుల వినియోగం దిశగా ప్రజలను చైతన్యపరచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేయనున్నట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలలో ముందుగా  కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పల్లెల్లో సైతం కొనసాగుతాయి.

సురక్షితమైన ఇంధనం


నగరాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి కళ్లెం వేసే చర్యలు మొదలయ్యాయి. పర్యావరణ అనుకూలమైన యూరో-3, యూరో-4 పెట్రోలు, డీజిల్‌ అందుబాటులోకి వచ్చేశాయని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద ఇటీవల తెలిపారు. దీనితో మన దేశంలో సురక్షితమైన ఇంధనం అందుబాటులోకి వచ్చి, మెల్ల మెల్లగా ప్రాణాలు హరించే హానికారక పెట్రోలు, డీజిల్‌ నుంచి జనానికి విముక్తి లభించనుంది.  
యూరో-4 గ్రేడ్‌ పెట్రోలు, డీజిల్‌ను 2010 ఏప్రిల్‌ 1 నుంచి హైదరాబాద్‌ సహా దేశంలోని 13 పెద్ద నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. యూరో-3 గ్రేడ్‌ ఇంధనాన్ని దశలవారీగా దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1 నాటికి అమల్లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యూరో-4 పెట్రోలు కోసం లీటర్‌కు రూ.0.50, డీజిల్‌ కోసం రూ.0.26, యూరో-3 పెట్రోలు కోసం రూ.0.26, డీజిల్‌ కోసం రూ.0.21 చొప్పున ధరలు పెంచారు.
అత్యున్నత స్థాయి ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు.. తమ చమురు శుద్ధి కర్మాగారాల్లో మార్పులు చేసుకున్నాయి. వీటికోసం రూ.32వేల కోట్లు ఖర్చుపెట్టాయి.

ఏమిటీ యూరో-3, 4
యూరో-3, 4 ప్రమాణాలు వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల స్థాయిని సూచిస్తాయి. ఐరోపా సంఘం (ఈయూ) సభ్య దేశాల కోసం వీటిని రూపొందించారు. ఈ ప్రమాణాల కింద ఇంధనాల్లో సల్ఫర్‌ పరిమాణాన్ని బాగా కుదించాల్సి ఉంటుంది. అందువల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. గాలి నాణ్యత పెరుగుతుంది. * యూరో-3 ఇంధనాల్లో సల్ఫర్‌ గరిష్ఠ స్థాయి 350 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉంటుంది. యూరో-4 ఇంధనాల్లో అది 50 పీపీఎంకు తగ్గుతుంది. ప్రస్తుతం భారత్‌లో వాడుతున్న పెట్రోల్‌, డీజిల్‌లో సల్ఫర్‌ పరిమాణం 550-350 పీపీఎం మేర ఉంటోంది.


అనారోగ్య సమస్యలు
ఇంధనంలో ఉన్న సల్ఫర్‌ ఆక్సీకరణం చెందడం వల్ల సల్ఫర్‌ డైఆక్సైడ్‌లు విడుదలవుతాయి. పైగా ఇంధనంలో సల్ఫర్‌ ఎక్కువగా ఉండడం వల్ల నైట్రోజన్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ఉద్గారాలు పెరుగుతాయి. గాలిలో సూక్ష్మ ద్రవ, ఘన పదార్థాల స్థాయి ఎక్కువవుతుంది. వీటివల్ల తీవ్ర శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి. అకాల మరణాలు పెరుగుతాయి. ఉబ్బసం రోగులకు ఈ కాలుష్య కారకాలు ప్రాణాంతకంగా మారతాయి. సూక్ష్మ పదార్థాల వల్ల భూతాపం పెరిగిపోతుంది. సల్ఫర్‌ ఆక్సైడ్‌ల వల్ల వాతావరణంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీనివల్ల భవనాలు, లోహాలు, పెయింట్లకు హాని జరుగుతుంది. ఆమ్ల వర్షాలూ పెరిగిపోతాయి. జల వనరుల్లోనూ ఆమ్లాలు పెరిగిపోతాయి. ఫలితంగా పంటలకూ నష్టం తీవ్ర వాటిల్లుతుంది.


ఎక్కడిదీ సల్ఫర్‌..?
పెట్రోలు, డీజిల్‌ ముడి చమురు నుంచి ఉత్పత్తవుతాయి. ఈ ముడి చమురులోనే సల్ఫర్‌ ఉంటుంది. దీని పరిమాణం ఒక్కో చమురు క్షేత్రంలో ఒక్కోలా ఉంటుంది. సల్ఫర్‌ తక్కువగా ఉన్న ముడి చమురును 'స్వీట్‌ క్రూడ్‌' అంటారు. ఈ పదార్థం అధికంగా ఉంటే 'సోర్‌ క్రూడ్‌'గా పేర్కొంటారు. ఉత్తర సముద్రం, నైజీరియాల్లో ఉత్పత్తయ్యే చమురులో సల్ఫర్‌ తక్కువగా ఉంటోంది. మధ్య ప్రాచ్యంలో లభిస్తున్న చమురులో ఈ పదార్థం ఎక్కువగా ఉంటోంది. సరాసరిన ముడి చమురులో సల్ఫర్‌ 1 నుంచి 3 శాతం మేర పేరుకుపోతోంది.


వాహనానికి నేస్తం
* వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో మోటారు వాహనాల ఉద్గారాలను తగ్గించడం చాలా కీలకం. ఇందులో సల్ఫర్‌ స్థాయిని తగ్గించడం చాలా ముఖ్యమైన చర్య. దీనివల్ల ఇతర ఉద్గారాలూ తగ్గుతాయి. 500 పీపీఎం కన్నా ఎక్కువగా సల్ఫర్‌ ఉంటే వాతావరణంలో సూక్ష్మ పదార్థాలు, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌లు పెరిగిపోతాయి. అత్యంత తక్కువ స్థాయిలో సల్ఫర్‌ (10 పీపీఎం కన్నా తక్కువ) ఉంటే ఈ ఉద్గారాలను 95శాతం మేర తగ్గించే పరిజ్ఞానాలను వాడడానికి వీలుకలుగుతుంది. * ఇంధన సామర్థ్యం పెరిగేలా, ఉద్గారాలు తక్కువగా ఉండేలా కార్ల తయారీదార్లు.. ఇంజిన్‌ డిజైన్‌లో మార్పులు చేస్తున్నారు. ఉదాహరణకు డీజిల్‌ ఇంజిన్‌లో 'హై ప్రెజర్‌ ఇంజెక్షన్‌ వ్యవస్థ' వల్ల వాహనం తక్కువ ఇంధనం వాడడంతోపాటు కాలుష్యకారకాల విడుదల కూడా తగ్గిపోతుంది. అయితే డీజిల్‌లో సల్ఫర్‌ స్థాయి ఎక్కువగా ఉంటే ఈ పరిజ్ఞానం సరిగా పనిచేయదు. * ఇంధనంలో సల్ఫర్‌ అధికంగా ఉంటే వాహనం నిర్వహణ ఖర్చులూ పెరుగుతాయి. ఈ పదార్థం వల్ల పిస్టన్‌ రింగ్‌, ఎగ్జాస్ట్‌ వ్యవస్థ వంటి భాగాలు వేగంగా తుప్పు పడతాయి. అందువల్ల తరచూ వీటిని మార్చాల్సి ఉంటుంది.
* సల్ఫర్‌ స్థాయి 50 పీపీఎం కన్నా తక్కువ ఉంటే పర్యావరణ పరంగాను, వాహన సామర్థ్యం పరంగాను అనేక ప్రయోజనాలు ఉంటాయి.

How many newspapers are there in India?

The total number of registered newspapers, as on 31st March, 2008: 69,323
The number of new newspapers registered during 2007-08: 4,332
Percentage of growth of total registered publications over the previous year: 6.7 %
The largest number of newspapers & periodicals registered in any Indian language (Hindi): 27,527
The second largest number of newspapers & periodicals registered in any language (English): 10,000
The state with the largest number of registered newspapers (Uttar Pradesh):10,779
The state with the second largest number of registered newspapers (Delhi): 9,483
The number of newspapers that submitted Annual Statements: 9,072
The total circulation of newspapers : 20,71,08,115
The largest number of newspapers & periodicals that submitted Annual Statements in any Indian language (Hindi): 4,962
The second largest number of newspapers & periodicals that submitted Annual Statements in any language (English) : 971
The largest circulated Daily: The Hindu,English,Chennai : 12,75,553
The second largest circulated Daily: Ananda Bazar Patrika,Bengali,Kolkata : 12,55,850
The third largest circulated Daily: Eenadu,Telugu,Hyderabad : 11,81,844
The largest circulated multi-edition Daily: The Times of India, English(5 editions):23,35,991
The second largest circulated multi-edition Daily: Eenadu,Telugu,(23 editions):22,27,025
The largest circulated periodical: The Hindu Weekly,English, Chennai : 11,28,569

Wednesday, September 22, 2010

బాక్టీరియాపై మొక్కల యుద్ధం

'ఆల్పైన్‌ పెన్నీక్రెస్‌' మొక్కను బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల నివారణకు వాడవచ్చంటున్నారు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీకి చెందిన డాక్టర్‌ గెయిల్‌ ప్రెస్టన్‌. వీటి ఆకులకు అద్భుత ఔషధ గుణాలున్నట్లు వారు చెబుతున్నారు. 'ఆల్పైన్‌ పెన్నీక్రెస్‌' అడవిపూల మొక్క ఆకులన్నీ జింక్‌, నికెల్‌, కాడ్మియం వంటి ఖనిజాల సమ్మిళితం.  ఈ ఆకులు అంటు వ్యాధులను నివారించే రక్షణ కవచాల్లాంటివి. ఆవమొక్కల కుటుంబానికి చెందిన ఈ మొక్కను 'ఆల్పైన్‌ పెన్నీక్రెస్‌' గా వ్యవహరిస్తున్నారు. ఐరోపా, బ్రిటన్‌లలో ఏపుగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకప్పుడు మైనింగ్‌ బాగా జరిగిన ప్రాంతాల్లోనే ఇవి అధికంగా కనిపిస్తున్నాయని డాక్టర్‌ గెయిల్‌ ప్రెస్టన్‌ వెల్లడించారు.

త్వరలో సుగంధ కోలా శీతల పానీయం


సుగంధ వేళ్లతో  సరికొత్తగా సుగంధ రసం కోలారూపంలో రాబోతోంది. రాష్ట్ర అటవీ ప్రాంతంలో దొరికే సుగంధ వేళ్లను దీనికోసం వినియోగించబోతున్నారు. మన రాష్ట్రంలో కర్నూలు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, ఇంకా  అనేక జిల్లాల్లో సుగంధ పాల మొక్కలు  పెరుగుతున్నాయి. అనేక ఏళ్లనుంచి గిరిజనులు ఈ మొక్కల వేళ్లను సేకరించి  విక్రయిస్తున్నారు. ఈ వేళ్లను ఉడికించి అందులోనుంచి వచ్చే రసంలో పంచదార, కొద్దిగా తేనె కలుపుకుని తాగిన  వారికి  శరీరంలో చల్లదనం చేకూరుతోంది. దీంతో అనేక జిల్లాల్లో సుగంధ రసంతో కూడిన సోడాలను కూడా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో శీతల పానీయాల సంస్థలు సుగంధ వేళ్లతో ప్రత్యేకంగా పానీయాలు తయారు చేయడానికి ఆసక్తిని చూపుతున్నాయి. వాణిజ్య తరహాలో ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చే ప్రముఖ శీతల పానీయాల సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని వాటికి ఈ వేళ్లను సరఫరా చేయాలని అటవీశాఖ యోచిస్తోంది. ముందుగా ఈ మొక్కలపై పేటెంట్‌ రైట్స్‌ను తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రపంచంలో మూడో శక్తివంతమైన దేశం భారత్‌

అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ కౌన్సిల్‌(ఎన్‌ఐసీ), యూరోపియన్‌ యూనియన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌ (ఈయూఐఎస్‌ఎస్‌) సంయుక్తంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితా ప్రకారం మొదటి రెండు స్థానాలు అమెరికా, చైనాకు దక్కాయి. దీని ప్రకారం గ్లోబల్‌ పవర్‌లో అమెరికా 22 శాతం, యూరోపియన్‌ యూనియన్‌ 16 శాతం, చైనా 12 శాతం, భారత్‌ 8 శాతం వాటా సాధించాయి. 2025 నాటికి చైనా, భారత్‌, బ్రెజిల్‌ మరింత బలోపేతం అవుతాయి. భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచం గుర్తిస్తోందని అనేందుకు ఇది ఒక ఉదాహరణ. 

హ్రస్వ దృష్టి జన్యువు గుర్తించిన శాస్త్రవేత్తలు

హ్రస్వ దృష్టి కారక జన్యువుని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు.  ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో కనిపించే ఈ రుగ్మతను నయం చేయడానికి కొత్త తరహా చికిత్స విధానాలను రూపొందించడానికి ఈ పరిశోధన అవకాశాలు కల్పిస్తుందని భావిస్తున్నారు. హ్రస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారి కంట్లో రెటీనాను చేరక ముందే దృశ్యాలు ఏర్పడతాయి. దీనివల్ల దూరంలో ఉన్న వస్తువులు మసకగా కనపడతాయి.
కాగా ఈ విషయానికి సంబంధించి లండన్ లోని   కింగ్స్‌ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆర్‌ఏఎస్‌జీఆర్‌ఎఫ్‌1 అనే జన్యువును గుర్తించింది. ఇది కన్ను వృద్ధిలోను, దృశ్యరూప సంకేతాలను మెదడుకు చేరవేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని తేల్చారు.

ఇంటర్నెట్ వినియోగంలో మనది నాలుగో స్థానం

ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగంలో మన దేశం నాలుగో స్థానం లో నిలిచింది.  ఎనిమిది కోట్ల పన్నెండు లక్షల నెటిజన్లు మన దేశం లో ఉన్నారని ఒక అధ్యయనం లో వెల్లడైంది. మరో మూడేళ్లలో జపాన్‌ను మనం దాటి పోతామని అంచనా.  ఈ లెక్కలు, అంకెలు ఘనంగానే ఉన్నా పల్లెల విషయానికొచ్చే సరికి ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్న వాళ్ల సంఖ్య చాలా తక్కువ. దేశమంతా కలిపి కేవలం యాభై నాలుగు లక్షల గ్రామీణ నెటిజన్లున్నారు. 2008లో ముప్ఫై మూడు లక్షలున్న ఆ సంఖ్య రెండేళ్లు గడిచేసరికి యాభై నాలుగు లక్షలైంది. ఇది ఒక్క ముంబై నగరంలోని నెటిజన్లకన్నా తక్కువే. ది ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐ.ఎ.ఎం.ఎ.ఐ), ఇండియన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ బ్యూరో (ఐఎం.ఆర్‌.బి.) సంయుక్త సర్వేలో ఈ విషయాలు తేలాయి. 

Saturday, September 18, 2010

సీత్రూ విమానం

ఆకాశంలో విహరిస్తూ భూలోక అందాలను వీక్షిస్తూ విమానయానం... పుష్పక వి మానం గుర్తుకి వస్తోంది కదూ - సీత్రూ విమానాన్ని నిర్మించటం ద్వారా ఈ అనుభూతిని అందించేందుకు అంతర్జాతీయ విమానాల తయారీ కంపెనీ ఎయిర్‌బస్ పరిశోధనలు జరుపుతోంది. ఎయిర్‌బస్ రూపకల్పన చేస్తున్న ఈ సీత్రూ విమానంలోని పైలెట్ ఒక మీట నొక్కగానే హైటెక్ సిరామిక్ స్కిన్ ద్వారా ఎలక్ట్రిక్ తరంగాలు వెలువడి మొత్తం విమానం అంతా సీత్రూ - పారదర్శకంగా మారిపోతుంది.

దీంతో అందులో పయనించే ప్రయాణీకులు వేల అడుగుల కిందన భూమి మీద ఉన్న మైదానాలు, అడవులు, నదీనదాలు, ఆకాశ హర్మ్యాలను ఆనందంగా వీక్షించడానికి వీలు కలుగుతుంది. ప్రయాణీకులు ఎటువంటి ఆసరాలేకుండా ఆకాశంలో విహరిస్తున్న అనుభూతిని ఈ విమానం ద్వారా కలిగించాలన్నది తమ ఉద్దేశమని ఎయిర్‌బస్ పరిశోధనా విభాగం అధిపతి యాక్సెల్ కెరిన్ ఒక జర్మన్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ విధమైన విమానం బరువు కూడా తక్కువగా ఉంటుందని దీంతో ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని అంటున్నారు. భవిష్యత్‌లో ఈ పుష్పకవిమానంలో విహరిస్తూ ఐదు ఖండాల్లోని ప్రపంచ వింతలను హాయిగా వీక్షించవచ్చునని అంటున్నారు. 'ది ఫ్యూచర్, బై ఎయిర్‌బస్' అన్న శీర్షికతో ఎయిర్‌బస్ ఫ్రాన్స్‌బర్గ్ ఎయిర్ షోలో ఈ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.

విద్యార్థులకు ఆరోగ్య కార్డు

విద్యార్థులకు వైద్య సంరక్షణ  ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డు  నవంబరు నుంచి పాఠశాల ఆరోగ్య పథకం
రాష్ట్రంలో పాఠశాల ఆరోగ్య పథకాన్ని పునురుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు దాదాపుగా పూర్తయ్యాయి. మొదటిదశలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక, ఉన్నత, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు అన్నింటిలోనూ నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా అమల్లోకి తీసుకురాబోతున్నారు. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని నాలుగేళ్ల కిందట నిలిపివేసిన ఈ పథకాన్ని పటిష్ఠంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ పి.వి.రమేష్‌ 'న్యూస్‌టుడే'తో చెప్పారు. దీని కోసం ఈ ఏడాది జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నుంచి రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. పాఠశాల ఆరోగ్య పథకం విధి విధానాలపై విద్యాశాఖ అధికారులకు పూర్తి వివరాలు అందచేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఏటా పదిశాతం పైన పిల్లలు అనారోగ్య కారణాలతో పాఠశాల స్థాయిలో బడి మానేస్తున్నారు. బడికి వెళుతున్న మొత్తం 85లక్షలు-90 లక్షల మంది పిల్లల్లో 10 శాతం మంది తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఆందోళనకర పరిణామం. మిగిలిన వారిలోనూ చాలా మంది రక్తలేమితో పాటు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రాణాంతకమైన వ్యాధులకు గురికాకుండా ఐదేళ్ల వయసులో తీసుకోవాల్సిన టీకాలు దాదాపు 40% మంది వేయించుకోవడం లేదు. కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల ఆరోగ్య పథకం కింద పిల్లలందరికీ ధనుర్వాతం, కంఠసర్పిలాంటి వ్యాధుల నివారణకు బూస్టర్‌ డోసు టీకాలు వేయనున్నారు. ఈ పథకం కింద 1-10వ తరగతి పిల్లలకు ఇచ్చే ఆరోగ్యకార్డుల్లో ఆరోగ్య సమాచారంతో పాటు పాఠశాల బదిలీ ధ్రువపత్రాన్ని కూడా జత పరుస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీలాంటి అభివృద్ధి చెందిన దేశాల తరహాలో పాఠశాల్లో ఆరోగ్యకార్డులు ఇవ్వడం వల్ల వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి నయం చేయడానికి అవకాశం ఉంటుందని డాక్టర్‌ పి.వి.రమేష్‌ చెప్పారు.

ఉపాధ్యాయులకు శిక్షణ: ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి అనుసరించాల్సిన విధానాలపై అధ్యాపకులకు శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి జిల్లా స్థాయిలో అక్టోబరులో శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు తీరును అధ్యయనం చేసిన తరవాత రెండో దశలో పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

పాఠశాల ఆరోగ్య పథకంలోని ముఖ్యాంశాలు
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే వైద్యుడు వారంలో రెండు రోజులు పాఠశాల ఆరోగ్య కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలి.
* ప్రతి నెలా ఒక నిర్దిష్టమైన రోజున పాఠశాలకు వెళ్లి పిల్లలను పరీక్షించి మందులు ఇవ్వాలి.
* నిర్ధారిత కాల పట్టిక ప్రకారం టీకాలు వేయాలి. విటమిన్‌-ఎ, నట్టల మందులు ఇవ్వాలి.

* అనారోగ్యకారక లక్షణాలు ఉన్న పిల్లలను గుర్తించి, వెంటనే వారికి తగిన చికిత్స కోసం ఉన్నతస్థాయి ఆస్పత్రులకు సిఫారసు చేయాలి.
* ఆరోగ్య సంరక్షణకు పాటించాల్సిన విధానాలు, ప్రథమ చికిత్స తదితర అంశాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు.

* ప్రతి వారం ఒక పీరియడ్‌ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై అవగాహన తరగతులు.
* మానసిక సంబంధమైన సమస్యలు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌.

Wednesday, September 15, 2010

వీడియోగేమ్‌లతో పిల్లల్లో చలాకీతనం!

వీడియోగేమ్‌లతో పిల్లల్లో చలాకీతనం పెరుగుతుందా? అవుననే అంటున్నారు న్యూయార్క్‌ పరిశోధకులు. వీడియోగేమ్‌లతో పిల్లలు సమయాన్ని వృథాచేస్తున్నారని పెద్దలు అనటం మనకు తెలిసిన విషయమే. వీడియోగేములు వారి చదువులు పాడుచేస్తున్నాయని నిందలున్నా, పిల్లలు సకాలంలో సరైన నిర్ణయం తీసుకునే శిక్షణ సాధనంగా అవి ఉపకరిస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడయింది.
ముఖ్యంగా పోరాట సన్నివేశాలుండే వీడియోగేమ్‌లు ఆడే పిల్లల్లో తమ చట్టూ ఏం జరుగుతుందో సునిశితంగా పసిగట్టే నైపుణ్యం, కచ్చితమైన, వేగవంతమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరగడానికి అవి దోహదం చేస్తున్నట్లు న్యూయార్క్‌లోని రోచెస్టర్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

చౌమొహల్లా ప్యాలెస్‌కు హెరిటేజ్‌ ‌ అవార్డు

చౌమొహల్లా ప్యాలెస్‌కు యునెస్కో హెరిటేజ్‌ మెరిట్‌ అవార్డు లభించింది. హైదరాబాద్‌ రాజధానిలోని చారిత్రక చార్మినార్‌ సమీపంలోని
'చౌమొహల్లా ప్యాలెస్‌' మరోమారు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఈ రాజప్రాసాదానికి 'యునెస్కో ఆసియా పసిఫిక్‌ హెరిటేజ్‌
మెరిట్‌ అవార్డు' లభించింది. ఆసఫ్‌జాహీ పాలకుల అధికార భవనంగా చరిత్రకెక్కిన ఈ ప్యాలెస్‌ను దేశ విదేశాల ప్రముఖులు  సందర్శించి ముగ్ధులయ్యారు. మూడు నెలల క్రితం ప్యాలెస్‌ అధికారులు ఈ అద్భుత కట్టడ విశిష్టత, పరిరక్షణ ఫొటోలను యునెస్కో హెరిటేజ్‌ అవార్డు నిమిత్తం కమిటీకి పంపారు. మరో 13 దేశాలు కూడా పోటీపడ్డాయి. కాగా చౌమొహల్లా ప్యాలెస్‌కు అవార్డు వరించింది. బ్యాంకాక్‌లోని పది మంది సభ్యుల కమిటీ ఈ  అవార్డును ప్రకటించింది.

Tuesday, September 14, 2010

పిల్లలకు కథలు

పిల్లలకు కథలు చెప్పాలని... మంచి మాటలను వినిపించాలని... మాతృభాష తియ్యదనాన్ని మేళవిస్తూ... విజ్ఞానాన్ని అందించాలని తపనపడే తల్లులెందరో! అటువంటి వారికి ఉపయోగపడేలా... చిన్నారుల భవితకు బాటలు పరిచేలా... అంతర్జాలంలో ఓ బాల ప్రపంచం ఏర్పడుతోంది. అభిరుచిగా బాలల సైట్లు తెరిచి... అదో తపనగా వాటిని నిర్వహిస్తున్న మహిళలతో వసుంధర ముచ్చటించింది.
కాన్వెంటు చదువులు, ఆంగ్లపాఠాల జోరు అధికమైంది. తెలుగు భాషలోని గొప్ప కథలు, మాటల ముత్యాలు, పద విన్యాసాలు పిల్లలకు చేరే మార్గాలు తక్కువైపోయాయి. అదే ఎందుకలా అనుకొన్న కొందరు మహిళలు బాలల సాహిత్యాన్ని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే క్రమంలో డాట్‌కామ్‌లు తెరిచారు. బ్లాగులు ఆరంభించారు. పిల్లలకు సులువుగా అర్థమయ్యేలా కొందరు రచనలు చేస్తే... మరికొందరు వారి భాగస్వామ్యానికి అవకాశం ఏర్పరిచారు.

హాయి 'జాబిలి'..
ఇప్పటి పిల్లలు పెద్ద గడుగ్గాయిలే! చెప్పే కథ ఏమాత్రం ఆసక్తిలేకపోయినా 'వద్దుపో..' అంటూ పరుగులు పెట్టేస్తారు. తిరుపతికి చెందిన రమ్యగీతిక నిర్వహిస్తున్న jabilli.in సైట్‌లోని కథలు ఆ పేరులానే చల్లని ఆహ్లాదాన్నిస్తున్నాయి. 'కథ నడుస్తున్న కొద్దీ 'అబ్బ..' అన్నంత ఆసక్తి చూపాలి. అవ్వ చెప్పిన కథలు, బేతాళకథలు ఈ కోవలోనివే. ఎంత రక్తి కట్టిస్తాయో.. పాత్రల ద్వారా ఎన్నో వ్యక్తిత్వాలు, విలువలు నేర్చుకునేలా వాటిని ఎంపిక చేస్తున్నా' అంటున్న రమ్య ఆకట్టుకునేందు కోసం యానిమేషన్‌ బొమ్మల్ని జంతువుల, నీతి కథలకి జోడించారు. అలానే 'సరదా ఆటలు' కదలనీయకుండా చేస్తాయి. 'అవును. ఇందులో ప్రయాణాల్లో ఆడే ఆట ఒకటి. బస్సు, జీపు, కారు, లారీ.. ఇలా ఒకొక్కరు ఒక్కోటి ఎంపిక చేసుకుని ఊరు చేరేదాకా దారిపొడవున ఎవరివి ఎక్కువ ఎదురైతే వారే గెలిచినట్లు.. లాంటి ఆటలు బోలెడున్నాయి' అని చెబుతుంది. ఇవేకాదు, మంచి మాటలు, ఇంట్లో చేసుకునే బొమ్మలు, తమాషా లెక్కలు... వంటివెన్నో దీన్లో ఉన్నాయి.

బాల వైభవం..
ఆటపాటల బాలసాహిత్యాన్ని పిల్లలకు చెప్పడమే కాదు, అలాంటివి వారి చేతనే రాయిస్తే మరింత ఉపయోగం అంటారు నెల్లూరుకు చెందిన రచయిత్రి చంద్రలత. ఆమె నడుపుతున్న బ్లాగు prabhavabooks.blogspot.comతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 'గుర్తించాల ేగానీ.. పిల్లల్లో చెప్పలేనంత సృజన ఉంది. ఎనిమిదేళ్లుగా వారికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నా. వాటిల్లో పాల్గొన్న ప్రతి చిన్నారిలో మార్పు గమనించా. అవన్నీ నా బ్లాగులో పొందుపరిచా. అలా ఐదారొందల మంది చిన్నారి రచయితలు తయారయ్యారు. వారు రాసినవన్నీ కొత్త కథలు, పాటలే. బొమ్మలూ వారిచేతనే వేయిస్తున్నా' అని చెప్పే ఆమె పిల్లలకు పదాలు, వాక్యాలు ఇచ్చి రచనలు చేయిస్తారు. వారు రాసిన వాటిని నెట్‌లో ఉంచుతారు.

పదాల మాటామంతి..
అమెరికాలో ఉంటున్న తెలుగు మహిళ లలిత కూడా చిన్నారుల కోసం ఒకసైట్‌ నిర్వహిస్తున్నారు. అక్షరాలు, కఠిన పదాలు, పద్యాలు చక్కగా పలుకుతూ... పిల్లలకు వివరించడాన్ని www.telugu4kids.comలో తన గొంతుతోనే వినిపించే ప్రయత్నం చేశారు. 'పిల్లల్ని ఆకట్టుకోవడంలో ప్రత్యేకత ఉండాలని అలా చేశాను. వారికి సులువుగా అర్థమయ్యేలా కాకి, మొదటి బావి వంటి వీడియో కథల్ని రూపొందించాను. తెనాలి రామకృష్ణ, వేమనపద్యాలు, సామెతలు వంటి వాటిని నెట్‌లో ఉంచాను. అక్షరం మీద క్లిక్‌ చేస్తే పలికే విధానం నా సైట్‌లో ఉంది' అని చెప్పే లలిత కొన్ని సరదా మాటల్ని 'తార' అనే పాత్రతో చెప్పించారు. తెలుగులో మరిన్ని ఆసక్తిగొలిపే kottapalli.in, www.telugudanam.co.in, www.bookbox.comలాంటి లింక్‌లు పిల్లలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు.

డాదిన్నర క్రితం 'జాబిలి' ఆరంభించిన నేను తిరుపతిలో ఓ రెస్టరంట్‌ నడుపుతున్నా. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ చేసిన నేను తల్లిదండ్రులకు, పిల్లలకు ఉపకరించేలా టపాలు రాస్తుంటా. అందులో నాకెంతో ఆనందం ఉంది. గతంలో కిండర్‌గార్టెన్‌ స్కూలు నడిపిన అనుభవంతో పిల్లలమనసుల్ని చదవగలిగా. వారిలో మార్పు తేవాలని నా ప్రయత్నం. ఇందులో నా భర్త, కుమారుడి ప్రోత్సాహం ఉంది.
- రమ్యగీతిక
పిల్లలు చెబితేనే అది కచ్చితమైన బాలసాహిత్యం. వాటిపై ఇప్పటిదాకా నాలుగైదు పుస్తకాలు రాశాను. ప్రస్తుతం మదనపల్లె రిషీవ్యాలీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రిసోర్స్‌ పర్సన్‌గా ఉన్న నేను తెలుగు భాషలో పిల్లలకి కావాల్సిందేమిటో దగ్గరుండి చూశాను. అమ్మ, ఆకలి ఎంత ముఖ్యమో భాష కూడా అంతే ముఖ్యం. కానీ పుస్తకాల్లో ఆడుకుంటూ పాడుకుంటూ నేర్చుకునేలా తెలుగు లేదు. అదే రెండేళ్ల క్రితం నేను బ్లాగ్‌ను రూపొందించేందుకు స్ఫూర్తి.
- చంద్రలత.
హైదరాబాద్‌లోనే ఎంసీఏ చదువుకున్నా. మా వారి ఉద్యోగరీత్యా న్యూజెర్సీ వచ్చా. నా చదువంతా ఆంగ్లమాధ్యమంలోనే. పిల్లలకి చక్కటి తెలుగు నేర్పించలేకపోతున్నాననే బాధే 'తెలుగు4కిడ్స్‌'కి ప్రాణం పోసింది. నాకు కాలక్షేపంగా, పదిమందికీ ఉపయోగంగా ఉంటుందనే ఈ ప్రయత్నం. నేను ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నా.
- లలిత

Monday, September 13, 2010

పదో తరగతి మార్కుల జాబితాలో తల్లి పేరు

పదో తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రంలో తల్లి పేరును కూడా ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాదరావుకు అందిన విజ్ఞప్తులపై పరిశీలన జరిపిన ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు  ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మార్కుల ధ్రువీకరణ పత్రంలో ప్రస్తుతం తండ్రి పేరును మాత్రమే ముద్రిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం తండ్రి పేరుతోపాటు తల్లి పేరును కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లిపేరు మాత్రమే ఉండాలని కోరుకున్నా కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. తండ్రి పేరు మాత్రమే ఉండాలని కూడా విద్యార్థి కోరుకోవచ్చు. 
వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పరీక్షల కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు తమ దరఖాస్తుల్లో తల్లి పేరు కావాలా, తండ్రి పేరు కావాలా లేక ఇద్దరి పేర్లు కావాలా అన్నది స్పష్టంగా పేర్కొనాలి. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

Saturday, September 11, 2010

అబ్దుల్ కలామ్


మన దేశానికి 11వ భారత రాష్ట్రపతి గా (జూలై 25, 2002 – జూలై 25, 2007) చేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలామ్ . అక్టోబర్ 15 1931 న తమిళనాడు రాష్ట్రం లోని ధనుష్కోడి, రామేశ్వరంలో అబ్దుల్ కలామ్ జన్మించారు.  సాధారణంగా ఏ. పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్. అంతే గాక ఆయన భారత దేశపు ప్రముఖ శాస్త్రవేత్త మరియు ఇంజనీరు కూడా.(1931-10-15)
చిన్ననాటి విశేషాలు 
"ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసిన రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు.'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి' 
ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం
తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ.. ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. 
ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958 లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగు లో పట్టా పుచ్చుకున్నాడు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ. లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరాడు. 1962 లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రో కు మారాడు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించాడు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980 లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.1982 లో, ఆయన DRDO కు డైరెక్టరు గా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించాడు. అగ్ని క్షిపణి మరియు పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై 1992 లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998 లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 
భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్(1990 లో); మరియు భారత రత్న (1997 లో) లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్.జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన మెజారిటీతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశాడు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్  కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో ఆయన ఏకైక ప్రత్యర్థి వామపక్షవాదులు తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనితగా ప్రసిద్ధురాలు.
 కలామ్ శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి . ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్ తో బాటు, భగవద్గీత ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు. మానవతావాది . తాను తిరుక్కురళ్ లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన దాదాపు తను చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం " నైనా ప్రస్తావిస్తాడు. 
కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నాడు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నాడు.ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పాఠకుల్నిఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశాడు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. బయో ఇంప్లాంట్స్  వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ నే సమర్థిస్తాడు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.

Friday, September 10, 2010

ఆంద్ర ప్రదేశ్ గవర్నర్లు

ఆంద్ర ప్రదేశ్ కు ఇప్పటి వరకు గవర్నర్లు గా చేసిన వారి వివరాలు

సంఖ్య పేరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
1 సి.ఎం.త్రివేది 01/11/1953 31/07/1957
2 భీమసేన్ సచార్ 01/08/1957 07/09/1962
3 జనరల్. ఎస్.ఎం.శ్రీనగేష్ 08/09/1962 03/05/1964
4 పీ.ఏ.థాను పిల్లై 04/05/1964 10/04/1968
5 ఖాండూభాయి కసాంజీ దేశాయి 11/04/1968 25/01/1975
6 జస్టిస్ ఎస్.ఓబులరెడ్డి 25/01/1975 09/01/1976
7 మెహనలాల్ సుఖాడియా 10/01/1976 15/06/1976
8 ఆర్.డీ.భండారీ 16/06/1976 16/02/1977
9 జస్టిస్ బీ.జె.దివాన్ 17/02/1977 04/05/1977
10 శారద ముఖర్జీ 05/05/1977 14/08/1978
11 కె.సి.ఆబ్రహాం 15/08/1978 14/08/1983
12 రామ్ లాల్ 15/08/1983 29/08/1984
13 డా. శంకర్ దయాళ్ శర్మ 29/08/1984 26/11/1985
14 కుముద్ బెన్ జోషి 26/11/1985 07/02/1990
15 కృష్ణకాంత్ 07/02/1990 21/08/1997
16 జి.రామానుజం 22/08/1997 23/11/1997
17 డా. సి.రంగరాజన్ 24/11/1997 02/01/2003
18 సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా 03/01/2003 03/11/2004
19 సుషీల్‌ కుమార్‌ షిండే 04/11/2004 29/01/2006
20 రామేశ్వర్ ఠాకూర్ 29/01/2006 19/08/2007
21 నారాయణదత్ తివారీ 19/08/2007 26/12/2009
22 ఈ.ఎస్.ఎల్.నరసింహన్ డిసెంబర్ 26, 2009

Thursday, September 9, 2010

జైజై గ్రీన్‌ గణేశా!

మళ్లీ వినాయక చవితి వచ్చేసింది. ప్రతి సంవత్సరం లానే పెద్ద పెద్ద వినాయక విగ్రహాలతో మండపాలను అలంకరించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే, కేవలం మట్టితో చేసిన 'ఎకో గణేశ' ఎక్కువ మండపాలలో దర్శనమివ్వనున్నాడు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన రంగుల స్థానంలో మట్టి వినాయకుడు, సహజమైన రంగుల్లో కనువిందు చేయనున్నాడు. ది సొసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సేవ్‌) సంస్థ గత ఆరు సంవత్సరాలుగా 'సుజలాం' కార్యక్రమంలో భాగంగా మట్టి గణేశులను ప్రజలకు అందిస్తోంది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ సహకారంతో 25 వేల మట్టి వినాయకులను ఉచితంగాను, మరో 25 వేలను నామమాత్రపు ధరకు పంపిణీ చేస్తోంది.
హిమాయత్ నగర్ లోని ఆక్స్‌ఫర్డ్‌  గ్రామర్‌ స్కూలులో మట్టి వినాయకుడిని తయారు చేసే విధానంపై విద్యార్థుల కోసం వర్క్‌షాప్‌ను నిర్వహించారు.  అదే విధంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకోసం  వర్క్‌షాప్‌లను నిర్వహించటం జరుగుతోంది. మట్టి, గడ్డి, జనప నార, వెదురు పుల్లల వంటి సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించి విద్యార్థులు వినాయక విగ్రహాలను తయారు చేయటం నేర్చుకొంటున్నారు.
మనమంతా కలిసి చేసే ఈ ప్రయత్నాల వలన జలాశయాలకు కలిగే హాని తగ్గుతుందని భావించవచ్చు.

భిన్న సంస్కృతులు

మనచుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో విశాలమైంది. ఈ ప్రపంచం - అంటే ఈ భూమి అంతటా  ఒకే విధంగా లేదు. కొన్ని చోట్ల సారవంతమైన మైదానాలున్నాయి. మరికొన్ని చోట్ల చండ్ర నిప్పులు కక్కే ఎడారులున్నాయి. అలాగే మంచు ఖండాలున్నాయి. ఈ విధంగా భూమి ఉపరితలం, మనకు ఒక్కో చోట ఒక్కో విధంగా కనిపిస్తుంది. అంతే కాదు దేశదేశాల శీతోష్ణస్థితులకి, వాతావరణానికి, సహజ వనరులకి మధ్య కూడా ఎంతో వ్యత్యాసముంది.
కేవలం భౌగోళిక పరిస్థితులలోనే కాదు, మానవ జీవన విధానంలో కూడా ఎన్నో భిన్నరీతులు ఉన్నాయి. మన చుట్టూ రకరకాల ప్రజలు ఉన్నారు. అనేక సంస్కృతులు ఉన్నాయి. పలు భాషలతో, రకరకాలయిన దుస్తులతో, ఆహార సంపాదనా విధానాలతో, ఆచార వ్యవహారాలతో, నమ్మకాలతో, చికిత్సా విధానాలతో, వివాహ పద్ధతులతో నిండివున్న ఈ మానవ సమాజం, రకరకాల రంగు రంగుల అల్లికలతో కూడిన అందమైన వస్త్రంలా కనిపిస్తుంది. నవీన ప్రయాణ సాధనాల వల్ల ఈ సువిశాల ప్రపంచం రోజు రోజుకి చిన్నదయి పోతోంది. అందువల్లే ఈ భిన్న సంస్కృతులు ఒక దాని ప్రభావానికి మరొకటి లోనవుతున్నాయి. ఇలా దగ్గర అవుతున్న భిన్న సంస్కృతులలో గల తారతమ్యాలను ఒక శాస్త్రీయ ధృక్పథంతో అవగాహన చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉంది.
చరిత్ర అడుగుపుటల్లోకి పోతే మానవ సమాజం ఏవిధంగా మారిపోతూందో మనకు విశదమవుతుంది. ఎన్నో కొత్త జాతులు ఆవిర్భవించాయి.కొన్ని ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులు మెరగయ్యాయి. మరికొన్ని ప్రాంతాలలో అవి క్షీణించాయి. ఒకనాడు ఎంతో అభివృద్ధి దశలో ఉన్న సమాజాలు ఈనాడు వెనకబడి ఉన్నాయి. గతంలో అనాగరిక సమాజాలుగా భావించిన సమాజాలు  ఈనాడు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాయి. ఎన్నో సమాజాలలో తలెత్తిన విప్లవాలు, ప్రపంచ పటం రూపు రేఖలను మార్చి వేశాయి. ఫలితంగా కొన్ని జాతుల విలీనం జరిగింది. అంతే కాదు. గతంలో  మునుపెన్నడూ ఊహించని స్థితిలో బీభత్సాలు, మారణ హోమాలు జరిగాయి. ఈ నూతన పరిణామాలు అనేక జాతుల, తెగల సంస్కృతులను కుదిపి వేశాయి. ఈ భిన్న సంస్కృతుల్ని గురించి తెలుసుకోవడం మనిషి మనుగడకు ఎంతో అవసరం.
వివిధ తెగల్ని గురించి, వారి సంస్కృతుల్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలం మనిషిలో ఏనాటి నుంచో ఉంది. ఈ శతాబ్ధంలో ఆ కుతూహలం మరింత ఎక్కువ అయింది. ఇతర సంస్కృతుల పట్ల మనకు సరియైన అవగాహన లేకపోతే మనకు విచిత్రంగా కనిపించే మనుషులను సమాజాలను మనం తక్కువగా అంచనావేసి, ఆ మనుషులను ఆటవికులని, ఆ సమాజాలు అనాగరిక సమాజాలని ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చే ప్రమాదముంది. ఇది నూటికి నూరుపాళ్ళు తప్పుడు అభిప్రాయమే. మనకు విచిత్రంగా కనిపించే ఈ మనుషులు వేలాది సంవత్సరాలనుంచి తమ పరిసరాలతో కలిసిపోయి హాయిగా జీవిస్తున్నారు. నవనాగరికుల మనుకొంటున్న మనం మన పరిసరాలను, వనరులను విచక్షణా రహితంగా నాశనం చేస్తూ, భావితరాలకి చీకటిని మిగులుస్తున్నాము.
ఇప్పుడు కాలచక్రాన్ని వెనక్కి తిప్పి, మన జీవిత విధానాన్ని మార్చుకోవడం ఎంత మాత్రం వీలు కాని పని. అయితే వేలాది సంవత్సరాల నుంచి ప్రకృతితో పరిసరాలతో కలిసిపోయేలా, తమ సాంఘిక ఆర్ధిక జీవన సరళిని తీర్చిదిద్దుకున్న వివిధ తెగల గురించి తెలుసుకోవడం వల్ల మనకు కనువిప్పు కలుగుతుంది. తమ ప్రత్యేక సంస్కృతుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని జీవిస్తున్న అయిదు వందల తెగలు ఈ భూమి మీద జీవిస్తున్నాయి. సామాజిక జీవితాన్ని అనేక విధాలుగా మలుచుకోవచ్చునని, ప్రతీ తరహా జీవన విధానంలో కూడా వ్యక్తి వికాసం, తృప్తి, ఆనందం యిమిడివున్నాయని- ఈ తెగల్ని గురించిన అధ్యయనం వల్ల మనకు తేటతెల్లమవుతుంది. అందువల్ల మన జాతి, మన తెగ, మన జీవిత విధానం మిగతా జాతుల, తెగల, జీవన విధానాల కంటె గొప్పదనే చెడు అభిప్రాయం తుడిచి పెట్టుకు పోతుంది. దానితో అన్ని జాతుల పట్ల, తెగలపట్ల సమభావం, గౌరవం పెరుగుతాయి.
ఈ సమభావాన్ని, గౌరవాన్ని 'బాలచెలిమి', పాఠకులలో నెలకొల్పి వాటిని పెంచి పెద్ద చేయడానికి వీలుగా 'బాలచెలిమి' ఒక తెగ యొక్క జీవనవిధానాన్ని అన్ని కోణాలనుంచీ తన పాఠకులకు అందివ్వాలనుకుంటోంది. ఇది 'బాలచెలిమి' పాఠకులలో అన్ని జాతుల పట్ల, తెగలపట్ల ఒక శాస్త్రీయ సద్భావనకు అంకురార్పణ చేస్తుందని ఆశిస్తున్నాం.

జలచరాలతో టూరిజమా?

జలచరాలను ఓషనేరియం, అక్వేరియంలలో, డాల్ఫినేరియంలలో ఉంచి టూరిజానికి ఊతం ఇ”వ్వాలనే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. ముంబాయిలో ఓషనేరియం, అక్వేరియంలను; ఢిల్లీలో డాల్ఫినేరియాన్ని; కేరళలో ఓషనేరియాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది అనాలోచితమైన చర్య అనీ, దీనిని ఆపాలనీ మనం కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖకు వ్రాద్దాం.
జలచరాల జీవితం ఎంతో వైవిధ్యభరితమైనది. అవి మనకన్నా మిన్నగా ఒకదానితో ఒకటి సమాచారం ఇచ్చిపుచ్చుకొంటాయని శాస్త్రవేత్తలు ఏనాడో తెలియజేశారు. విశాలమైన సముద్రాలలో స్వేచ్ఛగా ఈదులాడే జంతుచరాలను పట్టి తెచ్చి, రసాయనాల పూత పూసిన కాంక్రీటు ట్యాంకులలో ఉంచటం అసమంజసమైన విషయం. ఏ భిన్నత్వమూ, వైవిధ్యమూ లేని ట్యాంకులలో చిన్న చేపలైనా, అతి పెద్ద తిమింగలాలైనా చైతన్యాన్ని కోల్పోయి నిరాసక్తంగా మారతాయి.
సముద్రం లోని తిమింగలాలు, సొర చేపలకు రేడియో కాలర్‌ ట్యాగ్‌లను తగిలించటం ద్వారా, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని గుజరాత్‌ అధికారులు భావిస్తున్నారు. తద్వారా యాత్రికులు నావలలో ఆ ప్రాంతాలకు వెళ్లి వాటిని చూడవచ్చునని, దీని వలన టూరిజం పెరుగుతుందని వారి అభిప్రాయం. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ జల చరాల ఏకాంతానికి భంగం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజల డిమాండ్ల మేరకు ఇటువంటి పనులకు దూరంగా ఉంటున్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని మనం ప్రభుత్వాన్ని కోరదాం.

Wednesday, September 8, 2010

వినాయకుని పత్రిపై ఔషధ మొక్కల బోర్డు ప్రచారం

రాష్ట్ర ఔషధమొక్కల బోర్డు గణేశుని పూజకు ఉపయోగించే 21 రకాల ఆకులు, మొక్కల ప్రాధాన్యతపై ప్రచారం చేపట్టింది. ప్రజలకు నిత్య జీవనంలో ఉపయోగపడే ఔషధమొక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు పూర్వీకులు ప్రవేశపెట్టిన వినాయకునికి పత్రితో పూజ ప్రస్తుతం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ఔషధమొక్కల స్థానంలో విక్రేతలు పిచ్చిమొక్కలు అంటగడుతున్నారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు రాష్ట్ర ఔషధమొక్కల బోర్డు నాబార్డు ఆర్థిక సహకారంతో ప్రచారం చేపట్టింది. పూజకు ఉపయోగించే మొక్కల గురించి వివరాలతో పోస్టర్లు ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పూజకు ఉపయోగించే ఆకులు విక్రయించాలంటూ కొందరు వ్యాపారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు కూడా దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అడవికి దగ్గరగా ఉన్న పట్టణాల్లో యువతకు దీనిపై అవగాహన కల్పించి విక్రయాలు చేసేవిధంగా ప్రోత్సహిస్తున్నారు.

సదానందకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

సదానంద 
ప్రముఖ కథా రచయిత, విశ్రాంత అధ్యాపకుడు కలువకొలను సదానందకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  సదానంద రచించిన 'అడవి తల్లి' నవల కేంద్ర సాహిత్య అకాడమీ అందించే అరుదైన బాలసాహిత్య పురస్కారానికి ఎంపికైంది. కేంద్ర అకాడమీ 2010 సంవత్సరానికి ఉత్తమ బాల సాహిత్యంగా ఆగస్టు 20న గోవాలో జరిగిన సాహితీ బోర్డు సమావేశంలో ఈ పుస్తకాన్ని ఎంపిక చేశారు.  పన్నెండేళ్ల కిందట ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసిన సదానంద పలు పత్రికలకు వ్యాసాలు రాశారు. ఈయన గతంలో అనేక పురస్కారాలు పొందారు. ఆయన రాసిన నవల 'బంగారు నడచిన బాట'కు 1966లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుంచి అత్యుత్తమ బాల సాహిత్య పురస్కారం దక్కింది. 1976లో కథానికా రచనకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.

Tuesday, September 7, 2010

సెల్ టవర్లతో పక్షులకు ముప్పు

కిచ.. కిచల సందడితో మన ఇళ్ళ ముందు గింజలను  తింటూ మనకు ఆహ్లాదాన్ని పంచేవి  పిచ్చుకలు. మరి ఆ పిచ్చుకలను చూసి ఎన్ని రోజులైంది? అవి కనుమరుగై ఎన్నో ఏళ్లైంది కదా. మానవ జీవితాలతో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఆ చిన్ని పిట్టలు ఉన్నట్టుండి ఎందుకు కనుమరుగయ్యాయి?  సెల్ ఫోన్ టవర్ల విద్యుదయస్కాంత తరంగాలే వాటిని నిర్ధాక్షిణ్యంగా చిదిమేశాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మొబైల్ ఫోన్ టవర్ల మూలంగా పక్షులకు ఏర్పడుతున్న ముప్పు తీవ్రతపై అధ్యయనం చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.  ముంబైకి చెందిన నాచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ అసద్ రహ్మాని ఈ బృందానికి నేతృత్వం వహిస్తారు.  

Monday, September 6, 2010

Improve Your Search Experience


In addition to providing easy access to billions of web pages, Google has many special features to help you to find exactly what you're looking for.

Everyday Essentials:

Weather
To see the weather for many U.S. and worldwide cities, type "weather" followed by the city and state, U.S. zip code, or city and country.

Example:  

Stock Quotes
To see current market data for a given company or fund, type the ticker symbol into the search box. On the results page, you can click the link to see more data from Google Finance.

Example:  

Time
To see the time in many cities around the world, type in "time" and the name of the city.

Example:  

Sports Scores
To see scores and schedules for sports teams type the team name or league name into the search box. This is enabled for many leagues including the National Basketball Association, National Football League, National Hockey League, and Major League Baseball.

All sports data provided by STATS LLC

Example:  

Music
To listen to music, search for artists, albums, songs or lyrics.

Example:  


Sunrise & Sunset
To see the precise times of sunrises and sunsets for many U.S. and worldwide cities, type "sunrise" or "sunset" followed by the city name.

Example:  

Reference Tools

Calculator
To use Google's built-in calculator function, simply enter the calculation you'd like done into the search box.

Example:  

Book Search
If you're looking for results from Google Book Search, you can enter the name of the author or book title into the search box. Then, click on "Books" from the left-hand navigation to view book content. You can click through on the record to view more detailed info about that author or title.

Example:  

Earthquakes
To see information about recent earthquakes in a specific area type "earthquake" followed by the city and state or U.S. zip code. For recent earthquake activity around the world simply type "earthquake" in the search box.

Example:  

Unit Conversion
You can use Google to convert between many different units of measurement of height, weight, and volume among many others. Just enter your desired conversion into the search box and we'll do the rest.

Example:  

Public Data
To see trends for population and unemployment rates of U.S. states and counties, type "population" or "unemployment rate" followed by a state or county. You can click through to a page that lets you compare different locations.

Example:  

People Profiles
If you're looking for someone you just met or a long-lost friend, enter the name of that person plus some identifying words about him or her to see a list of people with that name.

Example:  

Choosing Keywords

Synonym Search
If you want to search not only for your search term but also for its synonyms, place the tilde sign (~) immediately in front of your search term.

Example:  


Dictionary Definitions
To see a definition for a word or phrase, simply type the word "define" then a space, then the word(s) you want defined. To see a list of different definitions from various online sources, you can type "define:" followed by a word or phrase. Note that the results will define the entire phrase.

Example:  


Spell Checker
Google's spell checking software automatically checks whether your query uses the most common spelling of a given word. If it thinks you're likely to generate better results with an alternative spelling, it will ask "Did you mean: (more common spelling)?". Click the suggested spelling to launch a Google search for that term.

Example:  

Local Search

Local Search
If you're looking for a store, restaurant, or other local business you can search for the category of business and the location and we'll return results right on the page, along with a map, reviews, and contact information.

Example:  

Movie Showtimes
To find reviews and showtimes for movies playing near you, type "movies" or the name of a current film into the Google search box. If you've already saved your location on a previous search, the top search result will display showtimes for nearby theaters for the movie you've chosen.

Example:  

Health Search

Health Conditions
To see information about a common disease or symptom, enter it into the search box and we'll return the beginning of an expert summary. You can click through to read the entire article in Google Health.

Example:  


Medications
To see information about most generic and brand name prescription drugs in the U.S., enter the drug name into the search box, and we'll display a summary and description of that medication. You can click through links from the National Institutes of Health to get more information about side effects, how to take the medication, precautions, dietary instructions, and what to do if you miss a dose.

Example:  

Poison Control
You can quickly find the U.S. poison control hotline (1-800-222-1222) by entering "poison control" or similar phrases into the search box.


Example:  

Suicide Prevention
You can quickly find the phone number for the National Suicide Prevention Lifeline (1-800-273-8255) by entering "suicide prevention" or similar phrases into the search box.


Example:  

Flu Vaccine Search
During flu season, search for "flu" to find tips on how to stay healthy from U.S. Health and Human Services and a flu shot locator which uses Google Maps to show you nearby locations offering seasonal and/or H1N1 flu vaccine.

Example:  

Trip Planning

Flight Tracking
To see flight status for arriving and departing U.S. flights, type in the name of the airline and the flight number into the search box.

Example:

Currency Conversion
To use our built-in currency converter, simply enter the conversion you'd like done into the Google search box and we'll provide your answer directly on the results page.

Example:  

Maps
Looking for a map? Type in the name or U.S. zip code of a location and the word "map" and we'll return a map of that location. Clicking on the map will take you to a larger version on Google Maps.

Example:  

Query Refinements

Plus (+) Operator
Google ignores common words and characters such as where, the, how, and other digits and letters that slow down your search without improving the results. If a common word is essential to getting the results you want, you can make sure we pay attention to it by putting a "+" sign in front of it.

Example:  

Related Search
To search for web pages that have similar content to a given site, type "related:" followed by the website address into the Google search box.

Example:  

Fill in the Blank
Sometimes the best way to ask a question is to get Google to 'fill in the blank' by adding an asterisk (*) at the part of the sentence or question that you want finished into the Google search box.

Example:  

Search by Number

Package Tracking
You can track packages by typing the tracking number for your UPS, Fedex or USPS package directly into the search box. We'll return results that include quick links to easily track the status of your shipment.

Example:  

Patent Numbers
To search for U.S. patents, enter the word "patent" followed by the patent number into the Google search box and hit the Enter key or click the Google Search button.

Example: