Saturday, August 7, 2010

అబ్రకం పొరల్లో జీవం ఆవిర్భావం!

అబ్రకం పొరల్లో జీవం ఆవిర్భావం!
అమెరికా శాస్త్రవేత్తల సరికొత్త సిద్ధాంతం
వాషింగ్టన్‌: జీవం ఎక్కడ మొదలైంది? శతాబ్దాలుగా మనిషిని తొలుస్తున్న ఈ ప్రశ్నకు కొత్త సమాధానం దొరికింది. అబ్రకం ఫలకాల్లో జీవం ఆవిర్భవించిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. పుస్తకంలోని పేజీల తరహాలో ఉండే ఈ ఖనిజం పొరల్లో మొదటి జీవి వూపిరి పోసుకుందని వివరించారు. ఈ పొరల మధ్య కంపార్ట్‌మెంట్లు ఉండేవని పేర్కొన్నారు. వీటిలో కొన్ని పరమాణువులు కణాలుగా మారడానికి అవసరమైన భౌతిక, రసాయన వాతావరణాన్ని అబ్రకం కల్పించిందని తెలిపారు. ''జీవం ఏర్పడడానికేకాదు.. దాని మనుగడకు ఈ ఖనిజ ఉపరితలం అనువైన పరిస్థితులను కల్పించింది'' అని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన హన్సమా చెప్పారు.