Thursday, August 19, 2010

విశ్వ దర్శనం

విశ్వం గురించి తెలుసుకోవాలంటే నగరంలోని ప్లానిటోరియం థియేటర్‌కు వెళ్లక్కర్లేదు. Asynx Planetariumతో కంప్యూటరే ప్లానిటోరియంలా మారిపోతుంది. గ్రహాల్ని, నక్షత్ర మండలాల్ని చూపిస్తుంది. మౌస్‌ మార్కర్‌ ద్వారా వివరాల్ని చూడొచ్చు. Geocentric, Helliocentric వ్యూలో విశ్వాన్ని చూడొచ్చు. నాసా చిత్రాలతో రూపొందించడం దీంట్లోని ప్రత్యేకత.

www.asynx-planetarium.కం

టైపింగ్‌ శిక్షణ!

టైప్‌బ్లాస్టర్‌ టూల్‌తో ఆడుతూ పాడుతూ టైపింగ్‌లో మీరు శిక్షణ పొందొచ్చు. అంతరిక్షంలో విమానాల్ని నడుపుతూ ముందు కనిపించే పదాల్ని టైప్‌ చేయాలి. టైప్‌ చేసిన అక్షరం వెంటనే పేలిపోతుంది. పదం పూర్తవ్వగానే స్పేస్‌బార్‌ కొట్టాలి. దీంతో మరో పదం లక్ష్యంగా మారుతుంది. ఇలా మీరు టైప్‌ చేస్తూ అక్షరాల్ని పేల్చే వేగాన్ని బట్టి స్కోర్‌ వస్తుంది.
స్కోర్‌బోర్డ్‌లో word per minute, Mistakes, Elapsed Timeలను చూడొచ్చు.

www.brothersoft. com/typeblaster-34910.html

మెదడుకు పదును

మీ పిల్లలకు వివిధ అంశాలకు సంబంధించిన పజిల్స్‌ని రూపొందించి ఇచ్చే పని కూడా పీసీకే చెప్పవచ్చు. అందుకోసం Puzzle Generator టూల్‌ ఉంది. సైట్‌ నుంచి దిగుమతి చేసుకుని వివిధ రకాల 'వర్డ్‌ పజిల్స్‌'ని రూపొందించుకోవచ్చు. ఓపెన్‌ చేయగానే Group, Title, Make Puzzle ఆప్షన్లతో విండో వస్తుంది. గ్రూప్‌లో మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని టైటిల్‌ ఎంటర్‌ చేసి మేక్‌ పజిల్‌ను క్లిక్‌ చేయండి. ఉదాహరణకు Earthని ఎంచుకుని పేరు ఎంటర్‌ చేస్తే ప్రత్యేక విండోలో పజిల్‌ ఓపెన్‌ అవుతుంది. జూమ్‌ఇన్‌ సౌకర్యంతో నచ్చినట్టుగా పజిల్‌ను చూడొచ్చు. www.canadiancontent.net/tech/download/puzzle_generator.html

ఇలా 'టైంటేబుల్‌'

పాఠశాల నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఇంట్లో ఏమేం చేయాలనే బాధ్యత కూడా పీసీకే అప్పగించండి. అందుకోసం తయారు చేసిందే ABC Timetable. దిగుమతి చేసుకుని నిక్షిప్తం చేయగానే డెస్క్‌టాప్‌పై ఐకాన్‌ వస్తుంది. టూల్‌ ఫుల్‌స్క్రీన్‌లో ఓపెన్‌ అవుతుంది.

టూల్‌బార్‌, వారం రోజులతో టేబుల్‌ వస్తుంది. టూల్‌బార్‌లోని Columns, Rowsతో నిలువు, అడ్డు వరుసల్ని పెట్టుకోవచ్చు. బాక్స్‌లో క్లిక్‌ చేసి షెడ్యూల్‌ని తయారు చేయవచ్చు. ఆకర్షణీమైన గ్రాఫిక్స్‌ని టేబుల్‌కి బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవాలంటే Select designను ఎంచుకోండి. Fontతో టేబుల్‌లో టైప్‌ చేసి టెక్ట్స్‌ నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.
ప్రింట్‌ తీసుకోవచ్చు కూడా. http://tinyurl.com/ABC-Timetable

మరికొన్ని...

*TinyPiano, http://tinyurl.com/398zolv

*Family Tree Pilot, http://family-tree-pilot.en.softonic.com

*SuperMemo, http://tinyurl.com/3ywfyl9