జీవితాన్ని కాసేపు మరిపింపజేయడానికే కళలు ఉన్నాయి. అలాంటి కళతో పసిప్రాయంలోనే ప్రపంచ చిత్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నాడు బ్రిటన్‌కు చెందిన ఏడేళ్ల కిరోన్ విలియంసన్. తాజాగా ఈ బాలుదు గీసిన చిత్రాలు రెండు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కేవలం అరగంట వ్యవధిలోనే మొత్తం 33 చిత్రాలను అభిమానులు సొంతం చేసుకోవడం విశేషం. అతడి చిత్రాలను కొనుగోలు చేసేందుకు ఇంకా ఎందరో వెయిటింగ్ లిస్టు లో ఉన్నారట. తీర ప్రాంతాలు, ప్రముఖ కట్టడాల సౌందర్యాన్ని చిత్రాలుగా తీర్చిదిద్దడంలో కిరోన్‌ది అందెవేసిన చెయ్యి. ''సాధారణంగా వీలైనంత త్వరగా నిద్ర లేస్తా. చిత్రాలు గీసిన తర్వాత బడికి వెళ్తా.సెలవు రోజు మాత్రం రోజంతా చిత్రకళపైనే దృష్టిపెడతా'' అని కిరోన్ చెప్పాడు.
