Saturday, August 14, 2010

పండ్లను మగ్గబెట్టేందుకు ఇథలీన్‌


పచ్చి కాయలను త్వరగా పళ్ళలా మార్చేందుకు వాటిని గడ్డిలోనో, గాలి సోకని గదుల్లోనో మగ్గబెట్టటం మనకు తెలిసిన విషయమే. అయితే ఇటీవల కాలంలో రకరకాల రసాయనాలను ఉపయోగించటం పెరుగుతోంది. 
వివిధ రకాల పండ్లను కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టడం వల్ల కలిగే ఆరోగ్య అనర్థాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న కాల్షియం కార్బైడ్‌ స్థానే ఇథలీన్‌ను ఉపయోగించడం సురక్షితమని భావిస్తున్నారు. ప్రమాణాల రూప కల్పనకు జాతీయ ఉద్యాన బోర్డు ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు భారత వ్యవసాయ పరిశోధన మండలి తెలిపింది. వివిధ రకాల పండ్లను ఏయే ఉష్ణోగ్రతల్లో ఎంత మేర ఇథలీన్‌ ఉపయోగించి మగ్గబెట్టాలనేదానిపై కమిటీ కసరత్తు చేస్తోండిపుడు.