Monday, August 2, 2010

చెత్త ఏరుకునే బాలిక నెట్‌ అందాలరాశి

నెట్‌ అందాలరాశి చెత్త ఏరుకునే టిబెట్‌ బాలిక
బీజింగ్‌: షాంఘై ఎగుమతి కేంద్రం వద్ద చెత్త ఏరుకొనే ఓ టిబెట్‌ అమ్మాయి ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో అత్యంత అందమైన బాలిక. నమ్మలేకపోతున్నారు కదూ.. చైనా ఇంటర్‌నెట్‌ ఫోరం నిర్వహించిన ఓ సర్వేలో టిబెట్‌కు చెందిన 15 ఏళ్ల అమ్మాయికి ఈ గౌరవం దక్కింది. ''అత్యంత అందమైన అమ్మాయి ఎవరు?'' అంటూ అడిగిన ప్రశ్నకు నెటిజన్లు ఇచ్చిన సమాధానమే ద్రోల్మా ఛూట్సో అని 'చైనా డెయిలీ' సోమవారం వెల్లడించింది. ఈ బాలిక అక్కడ తాగి పారేసిన శీతల పానీయాల సీసాలు, డబ్బాలు ఏరుకొని బతుకుతోంది. అక్కడ ఉండే వందలాది మంది బాలికల్లో నెటిజన్లు ఆమెనే అందమైన అమ్మాయిగా గుర్తించారు. ఈ తీర్పును గౌరవిస్తూ ''చూశారా పట్టణ జీవితాన్ని ఆ అమ్మాయి ఏ విధంగా అందంగా మార్చిందో..'' అంటూ ఇంటర్‌నెట్‌ ఫోరం వ్యాఖ్యానించింది.