Friday, August 20, 2010

గణితం ఇక ఎంతో సులభం


కేవలం ఆటలకే  కాదు చదువులో ఉపయోగపడేలా కంప్యూటర్‌ను వాడుకోవచ్చు. ఇందుకు ఎన్నో ఉచిత సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించటం నేర్చుకొవాలంతే.


కంప్యూటర్‌నే ఓ చక్కని ట్యూటర్‌గా మార్చేయ వచ్చు. పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలను సులువుగా అర్థమయ్యేరీతిలో, బొమ్మలు, గ్రాఫిక్స్‌తో మనసుకి హత్తుకునేలా బోధిస్తూనే... మెదడుకు పదును పెట్టే పజిల్స్‌, వీడియో గేమ్‌లతో ఆకట్టుకునే అద్భుతమైన సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి.

మాత్ హోం వర్క్  మేకెర్ తో కంప్యూటర్‌ని లెక్కల మాస్టర్‌గా మార్చేయవచ్చు. రకరకాల ఉదాహరణలతో ఉన్నత పాఠశాల దగ్గర్నుంచి కాలేజీల్లో చెప్పే గణిత పాఠ్యాంశాల్ని ఇది సులువుగా చెబుతుంది. రంగుల బాక్సుల్లో కనిపించే పాఠ్యాంశాల్లో నచ్చిన దానిపై క్లిక్‌ చేస్తే చాలు లెక్కలు సిద్ధం. ఉదాహరణకు  వైశాల్యం, వ్యాసార్ధం, వ్యాసం, చుట్టుకొలతలను కనుక్కోవచ్చు. సైట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ను దిగుమతి చేసుకున్నాక, తెరపైకి వచ్చే 'మాథ్స్‌ హోంవర్క్‌ మాస్టర్‌'పై డబుల్‌క్లిక్‌ చేసి రన్‌ చేయాలి. http://math-hw-maker.official.ws/