Monday, August 16, 2010

సిఎంఎస్‌ వాతావరణ్‌ 2010

cms_vatavaran
హైదరాబాద్‌ సిఎంఎస్‌ వాతావరణ్‌ 2010 ఆధ్వర్యంలో 'కామన్‌వెల్త్‌ గేమ్స్‌ : 2010 లో కార్బన్‌ ఫెయిర్‌' పేరిట పర్యావరణం, వన్య ప్రాణి చిత్రోత్సవాలను హైదరాబాద్‌లో ఆగస్ట్‌లో నిర్వహించారు. శేఖర్‌ దత్తాత్రి నిర్మించిన 'ది ట్రూత్‌ ఎబౌట్‌ టైగర్‌' చిత్రాన్ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించటంతో పాటు అవార్డులను పొందిన 40 చిత్రాలను చిత్రోత్సవంలో ప్రదర్శించారు.
పృధ్వీ రత్న అవార్డు గ్రహీత శేఖర్‌ దత్తాత్రి, చిత్ర నిర్మాత గిరిశ్‌ గిరిజా జోషి, సేవ్‌ సంస్థకు చెందిన విజయ రామ కుమార్‌, సివిల్‌ సొసైటీ నాయకుడు డాక్టర్‌ రావు చెలికాని, అర్బన్‌ ప్లానర్‌ బి.ఎన్‌.రెడ్డి, పర్యావరణ వేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తం రెడ్డిలను ఈ సందర్భంగా గ్రీన్‌ హీరోల పేరిట సత్కరించారు.
పర్యావరణం, వాతావరణ మార్పులు, సుస్థిర సాంకేతిక పరిజ్ఞానం, ఎకో టూరిజం వంటి పలు అంశాలపై సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఓపెన్‌ ఫోరం, ప్యానల్‌ డిస్కషన్‌లు, విద్యార్థులకు వివిధ పోటీలను ఈ సందర్భంగా నిర్వహించారు.
పెయింటింగ్, క్లే మోడలింగ్, ఫోటోగ్రఫీ వంటి పోటీలలో ఎంట్రీలను భారతీయ విద్యా భవన్ లో  ప్రదర్శించారు.  వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.