Thursday, August 26, 2010

తమిళనాట సిఎఫ్‌ఎల్‌ వెలుగులు



ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై కాంపాక్ట్‌ ఫ్లోరసెంట్‌ లాంప్‌లను మాత్రమే ఉపయోగించాలంటూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పాతకాలం నాటి ఇన్‌కాండెసెంట్‌ బల్బులను (గుబ్బ బల్బు) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సహకార సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సహాయం పొందుతున్న సంస్థల కార్యాలయాలలో ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

నాలుగు కోట్ల 60 వాట్‌ల ఇన్‌కాండెసెంట్‌ బల్బులకు బదులుగా 14 వాట్‌ల సిఎఫ్‌ఎల్‌లను ఉపయోగించటం వలన ఒక్క గంటకు 1840 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేయవచ్చునని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంటోంది. నాలుగు కోట్ల 60 వాట్‌ల ఇన్‌కాండెసెంట్‌ బల్బులను గంట సేపు వాడటం వలన 2400 మెగావాట్ల విద్యుత్‌ వ్యయం అవుతుంది. కాగా అదే సంఖ్యలో 14 వాట్ల సిఎఫ్‌ఎల్‌లను వాడటం వలన కేవలం 560 మెగావాట్‌ల విద్యుత్తు మాత్రమే ఖర్చు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.