skip to main |
skip to sidebar
చమురుతెట్టెను తినేసిన బ్యాక్టీరియా
8:15 PM
Vikasa Dhatri
చమురుతెట్టెను తినేసిన బ్యాక్టీరియా
మెక్సికో తీరప్రాంతంలో అద్భుతం
బీపీ సంస్థకు అనుకోని వరం లండన్: మూడునెలల క్రితం మెక్సికో తీరప్రాంతంలో (గల్ఫ్ ఆఫ్ మెక్సికో) పేరుకుపోయిన భారీ చమురు తెట్టె అదృశ్యం కావటంలో బ్యాక్టీరియా సూక్ష్మక్రిములు కీలకపాత్ర వహించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. బీపీ సంస్థకు చెందిన దాదాపు 50 లక్షల బ్యారెళ్లకు సమానమైన చమురు.. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని సముద్రంలోకి ఒలికిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఇది అత్యంత భారీ చమురు లీకేజీగా నమోదైంది. ఈ ఘటన తర్వాత 35 కిలోమీటర్ల పొడగునా 3600 అడుగుల లోతున్న చమురు తెట్టె ఏర్పడింది. దీన్ని తొలగించటంపై బీపీ పరిశోధకులు మల్లగుల్లాలు పడ్డారు. అనేక పద్ధతులను అవలంభించారు. అయితే, వారికి 'ఒషెనోస్పిరిల్లేల్స్' అనే బ్యాక్టీరియా నుంచి అనుకోని సహకారం లభించింది. చమురును హరాయించుకునే సామర్థ్యమున్న ఈ బ్యాక్టీరియా క్రిములు.. తెట్టె ఏర్పడిన తర్వాత వందలకోట్ల సంఖ్యలో అక్కడ గుమిగూడి చమురును తినేయటం ప్రారంభించాయి. మూడునెలల్లో చమురు మరక అన్నది లేకుండా చేశాయి. అయితే, కొద్దిమంది నిపుణులు ఈ వాదనతో విబేధిస్తున్నారు. చమురు తెట్టె పలచనవటంవల్లో, వేరే ప్రాంతానికి తరలిపోవటంవల్లో అదృశ్యమై ఉంటుందని చెబుతున్నారు.