Sunday, August 1, 2010

వారసత్వ సంపదగా జైపూర్‌ జంతర్‌ మంతర్‌

పింక్‌ సిటీ జైపూర్‌ లోని జంతర్‌ మంతర్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. బ్రెసీలియాలో సమావేశమైన యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 28వ కట్టడం జంతర్‌ మంతర్‌. 1727-34 మధ్య కాలంలో మహారాజా జైసింగ్‌-2 దీన్ని నిర్మించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏడు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఈ గుర్తింపు నిచ్చింది. దీనితో జైపూర్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది.