Monday, August 2, 2010

ఒత్తిడిని చిత్తు చేసే టీకా!

ఒత్తిడికి ఉపశమనం కోసం గుప్పెడేసి మాత్రలు మింగక్కర్లేదని చెబుతున్నారు పరిశోధకులు. .. యోగా, ధ్యానాలతో అంతకన్నా పనిలేదని చెబుతున్నారు పరిశోధకులు. తాము అభివృద్ధి చేసే టీకా ఒత్తిడికి దివ్యౌషధమని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 30 ఏళ్లుగా శ్రమించి ప్రపంచంలోనే తొలిసారిగా ఒత్తిడి నిరోధక టీకాను తయారుచేస్తున్నామని చెప్పారు. ఈ టీకా ఒక్క మోతాదుతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. దీర్ఘకాలంగా ఒత్తిడికి గురవుతున్నవారు మధుమేహం, గుండెజబ్బుల బారిన పడుతున్నారని హెచ్చరించారు. ఇలాంటివారికి ప్రత్యేక ఉపశమన థెరపీలు, మాత్రలు అవసరం లేకుండా జన్యు సాంకేతిక విధానంలో ఈ టీకాను రూపొందిస్తున్నట్లు స్టాన్‌ఫర్డ్‌ న్యూరోసైన్స్‌ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ సపోల్‌స్కై వివరించారు.