Friday, July 16, 2010
కంప్యూటర్ గేమ్స్
10:07 AM
Vikasa Dhatri
కంప్యూటర్‌లో ఆటలు ఆడటం ఇపుడు సాధారణమై పోయింది. పట్టణాలు, నగరాల్లో పిల్లలు బయట ఆటల కంటే ఎక్కువ సేపు కంప్యూటర్‌లో ఆటలు ఆడేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇది అంత మంచిది కాదు. కంప్యూటర్‌లో ఎక్కువ సేపు ఆటలు ఆడటం వలన మున్ముందు పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలూ - జాగ్రత్త పడండి. కంప్యూటర్‌తో ఆటలు ఆడండి. కానీ కేవలం కొద్ది సమయం మాత్రమే. అదీ మనం కొత్త విషయాలు నేర్చుకొనేందుకు ఉపయోగపడే ఆటలు ఆడండి. చరిత్ర, శాస్త్ర సాంకేతిక విషయాలు, ఇంగ్లీష్ గ్రామర్, చిత్ర లేఖనం వంటివి నేర్చుకొనేందుకు ఉపయోగపడే ఆటలు ఆన్‌లైన్‌లో ఎన్నో ఉన్నాయి. మరి మీరు అటువంటి ఆటలు ఆడుతున్నారా? మీరు ఆడుతున్న ఆటల గురించి మాకు వ్రాసి పంపండి. మిగిలిన బాల నేస్తాలకు కూడా ఈ విషయాలను తెలియజేద్దాం.
