భావ వ్యక్తీకరణకు సంక్షిప్త సందేశానికి (ఎస్సెమ్మెస్) మించిన సాధనం లేదని భావిస్తున్న రోజులు ఇవి. ఎస్ ఎం ఎస్ ల సంఖ్య రోజు రోజుకు చాంతాడులా పెరిగిపోతోంది. ఇపుడు ప్రతి సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు ఇతరులకు చేరుతున్నాయని ఐక్య రాజ్య సమితి (ఐరాస) దూర ప్రసార సంస్థ వెల్లడించింది. మూడేళ్లలో ఇది మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2007లో 1.8 ట్రిలియన్ సంక్షిప్త సందేశాలు నమోదయ్యాయి. అది 2010 వచ్చేసరికి 6.1 ట్రిలియన్ దాటింది. వీటి కోసం ప్రజలు సెకనుకు రూ.6.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 2009 లెక్కల ప్రకారం సంక్షిప్త సందేశాలతో కాలం గడిపేవారిలో ఫిలిప్పీన్స్, అమెరికన్లు ముందున్నారు.
Monday, December 20, 2010
సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు
8:28 PM
Vikasa Dhatri
భావ వ్యక్తీకరణకు సంక్షిప్త సందేశానికి (ఎస్సెమ్మెస్) మించిన సాధనం లేదని భావిస్తున్న రోజులు ఇవి. ఎస్ ఎం ఎస్ ల సంఖ్య రోజు రోజుకు చాంతాడులా పెరిగిపోతోంది. ఇపుడు ప్రతి సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు ఇతరులకు చేరుతున్నాయని ఐక్య రాజ్య సమితి (ఐరాస) దూర ప్రసార సంస్థ వెల్లడించింది. మూడేళ్లలో ఇది మూడు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2007లో 1.8 ట్రిలియన్ సంక్షిప్త సందేశాలు నమోదయ్యాయి. అది 2010 వచ్చేసరికి 6.1 ట్రిలియన్ దాటింది. వీటి కోసం ప్రజలు సెకనుకు రూ.6.20 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 2009 లెక్కల ప్రకారం సంక్షిప్త సందేశాలతో కాలం గడిపేవారిలో ఫిలిప్పీన్స్, అమెరికన్లు ముందున్నారు.
రోజూ బాదం.. దరిచేరదు జ్వరం
8:26 PM
Vikasa Dhatri
బాదం గింజలు బలవర్థకమైన ఆహారమే కాదు.. తరచూ వచ్చే జలుబు, జ్వరాలకు దివ్యౌషధంగా పనిచేస్తాయని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుందని తెలిపింది. బాదం పైపొర రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఇటలీలోని పాలీక్లినికో వర్సిటీ శాస్త్రవేత్త గైసెప్పినా చెప్పారు. తెల్లరక్తకణాల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శరీరంలో వైరస్‌ల వ్యాప్తిని అరికట్టడంలోనూ బాదం పాత్ర కీలకమని వివరించారు. గింజలు పూర్తిగా అరిగిపోయిన తర్వాత కూడా వాటి ప్రభావం ఉంటుందన్నారు. ''బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జలుబు, జ్వరంపై ఇవి అద్భుతంగా పనిచేస్తాయి'' అని తెలిపారు.
Thursday, December 9, 2010
'డిస్కవరి' యాత్రలో ఎలుకలు
3:52 PM
Vikasa Dhatri
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వ్యోమనౌక డిస్కవరీ అంతరిక్షంలోకి చివరిసారిగా పయనమైనప్పుడు 16 ఎలుకలు ప్రయాణమయ్యాయి. అంతరిక్ష యాత్రల వల్ల వ్యోమగాముల రోగనిరోధకశక్తి తాత్కాలికంగా క్షీణించడానికి కారణాలను వెతికి పట్టుకునే ప్రయోగంలో భాగంగా వీటిని రోదసిలోకి పంపుతున్నారు. అంతరిక్ష యాత్రల కారణంగా వ్యోమగాముల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోయి. వైరస్, బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ల బారిన పడడాన్ని నాసా 25 ఏళ్ల నుంచి గమనిస్తోంది. తాజా ప్రయోగాన్ని టెక్సాస్ విశ్వవిద్యాలయంతో పాటు నాసాకు చెందిన ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్నాయి.
Subscribe to:
Comments (Atom)